.

ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలలో బానిసపై మరియు స్వతంత్ర వ్యక్తిపై, పురుషులపై మరియు స్త్రీలపై, చిన్నవారిపై మరియు పెద్దవారిపై మొత్తం అందరిపై ఒక సాఅ ఖర్జూరాలు లేదా ఒక సాఅ బార్లీ జకాతుల్-ఫితర్‌ దానం చెల్లింపును విధిగావించారు. ప్రజలు ఈద్ నమాజుకు వెళ్ళే ముందే దానిని చెల్లించాలని ఆయన ఆదేశించారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్ తర్వాత వెంటనే జకాతుల్ ఫితర్‌ దానం చెల్లింపును తప్పనిసరి చేశారు.దీని పరిమాణం ఒక "సాఅ (దాదాపు 2.75 కిలోగ్రాములు)", ఇది బరువులో నాలుగు "ముద్ లకు (దాదాపు 0.6875 గ్రాములు)" సమానం. ఒక ముద్ద్ అంటే సగటు వ్యక్తి రెండు దోసేళ్ళ పరిమాణం (ఖర్జూరాలు లేదా యవలు). ప్రతి ముస్లిం—స్వతంత్రుడైనా, బానిస అయినా, పురుషుడైనా, స్త్రీయైనా, చిన్నవాడైనా, పెద్దవాడైనా — ఇది తప్పక దానం చేయాలి. ఇది తన అవసరాలకు మించి, తన కుటుంబ సభ్యులకు ఆ దినము మరియు రాత్రి అవసరాలకు మించి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రజలు ఈద్ నమాజ్‌కు వెళ్లే ముందే జకాతుల్-ఫిత్ర్ దానం చెల్లించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారు.

فوائد الحديث

రమదాన్ నెల తరువాత జకాతుల్-ఫిత్ర్‌ దానమును చిన్నవాడు, పెద్దవాడు, స్వతంత్రుడు, బానిస — ప్రతి ఒక్కరి తరఫున ఇవ్వాలి. దీనిని పిల్లల తరుఫున వారి సంరక్షకులు (వలీ) మరియు బానిసల తరుఫున వారి యజమాని ఇవ్వాలి. ఒక వ్యక్తి తన తరఫున, తన పిల్లల తరఫున, మరియు తన బాధ్యతలో ఉన్న వారందరి తరఫున జకాతుల్-ఫిత్ర్ దానం తప్పనిసరిగా పేదలకు చెల్లించాలి.

గర్భంలో ఉన్న పిండం తరఫున జకాతుల్-ఫిత్ర్ దానం ఇవ్వడం తప్పనిసరి కాదు; అయితే, ఆలా ఇవ్వడం సిఫార్సు చేయబడింది (ముస్తహబ్).

ప్రతి ప్రాంతంలోని ప్రజలు ప్రధానంగా తినే స్థానిక ఆహార పదార్థాలు ఫిత్రా దానంగా ఇవ్వాలి. (ఉదా గోధుమలు, బియ్యం, ఖర్జూరాలు, మొక్కజొన్న, బార్లీ ...)

ఈదుల్ ఫిత్ర్ నమాజుకు ముందు, ముఖ్యంగా ఈద్ రోజు ఉదయం ఇవ్వడం తప్పనిసరి, మరియు ఈద్ కు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఇవ్వడం అనుమతించబడింది.

التصنيفات

జకాతుల్ ఫితర్