జకాతుల్ ఫితర్

జకాతుల్ ఫితర్

1- “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మా మధ్య ఉన్నప్పుడు, మేము మాలోని ప్రతి చిన్నవారి తరఫున, ప్రతి పెద్దవారి తరఫున, యువకుల తరఫున, వృద్ధుల తరఫున, స్వేచ్ఛా బానిసల తరఫున, ఒక సా' ఆహారం, లేదా ఒక సా' వెన్న, లేదా ఒక సా' బార్లీ, లేదా ఒక సా' ఖర్జూరం, లేదా ఒక సా' ఎండుద్రాక్ష, జకాతుల్ ఫితర్’గా ఇచ్చేవాళ్ళం*. ముఆవియా ఇబ్న్ అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హుమా) హజ్జ్ నుండో ఉమ్రా నుండో తిరిగి వచ్చేంత వరకు మేము జకాతుల్ ఫిత్ర్ ఈ విధంగా తీయడం ఆపలేదు (అంటే ఈ విధంగానే జకాతుల్ ఫిత్ర్ ఇస్తూ వచ్చాము). ఆయన మెంబర్ పైకి ఎక్కి ప్రజలను సంబోధించి ఇలా అన్నారు: “రెండు ‘ముద్’ల సిరియా గోధుమలు ఒక ‘సా’ ఖర్జూరాలకు సమానము అని నేను భావిస్తున్నాను”. ప్రజలు దానిని అంగీకరించారు. అబూ సఈద్ అల్ ఖుద్రీ (ర) ఇంకా ఇలా అన్నారు: “కానీ నేను మాత్రం జీవించి ఉన్నంత కాలం ఆ విధంగానే జకాతుల్ ఫిత్ర్ తీస్తాను, ఏ విధంగానైతే నేను (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్న కాలం నుండి) ఇప్పటి వరకూ తీస్తూ వచ్చినానో.”