إعدادات العرض
“రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మా మధ్య ఉన్నప్పుడు, మేము మాలోని ప్రతి చిన్నవారి తరఫున, ప్రతి పెద్దవారి…
“రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మా మధ్య ఉన్నప్పుడు, మేము మాలోని ప్రతి చిన్నవారి తరఫున, ప్రతి పెద్దవారి తరఫున, యువకుల తరఫున, వృద్ధుల తరఫున, స్వేచ్ఛా బానిసల తరఫున, ఒక సా' ఆహారం, లేదా ఒక సా' వెన్న, లేదా ఒక సా' బార్లీ, లేదా ఒక సా' ఖర్జూరం, లేదా ఒక సా' ఎండుద్రాక్ష, జకాతుల్ ఫితర్’గా ఇచ్చేవాళ్ళం*. ముఆవియా ఇబ్న్ అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హుమా) హజ్జ్ నుండో ఉమ్రా నుండో తిరిగి వచ్చేంత వరకు మేము జకాతుల్ ఫిత్ర్ ఈ విధంగా తీయడం ఆపలేదు (అంటే ఈ విధంగానే జకాతుల్ ఫిత్ర్ ఇస్తూ వచ్చాము). ఆయన మెంబర్ పైకి ఎక్కి ప్రజలను సంబోధించి ఇలా అన్నారు: “రెండు ‘ముద్’ల సిరియా గోధుమలు ఒక ‘సా’ ఖర్జూరాలకు సమానము అని నేను భావిస్తున్నాను”. ప్రజలు దానిని అంగీకరించారు. అబూ సఈద్ అల్ ఖుద్రీ (ర) ఇంకా ఇలా అన్నారు: “కానీ నేను మాత్రం జీవించి ఉన్నంత కాలం ఆ విధంగానే జకాతుల్ ఫిత్ర్ తీస్తాను, ఏ విధంగానైతే నేను (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్న కాలం నుండి) ఇప్పటి వరకూ తీస్తూ వచ్చినానో.”
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) మా మధ్య ఉన్నప్పుడు, మేము మాలోని ప్రతి చిన్నవారి తరఫున, ప్రతి పెద్దవారి తరఫున, యువకుల తరఫున, వృద్ధుల తరఫున, స్వేచ్ఛా బానిసల తరఫున, ఒక సా' ఆహారం, లేదా ఒక సా' వెన్న, లేదా ఒక సా' బార్లీ, లేదా ఒక సా' ఖర్జూరం, లేదా ఒక సా' ఎండుద్రాక్ష, జకాతుల్ ఫితర్’గా ఇచ్చేవాళ్ళం. ముఆవియా ఇబ్న్ అబూ సుఫ్యాన్ (రదియల్లాహు అన్హుమా) హజ్జ్ నుండో ఉమ్రా నుండో తిరిగి వచ్చేంత వరకు మేము జకాతుల్ ఫిత్ర్ ఈ విధంగా తీయడం ఆపలేదు (అంటే ఈ విధంగానే జకాతుల్ ఫిత్ర్ ఇస్తూ వచ్చాము). ఆయన మెంబర్ పైకి ఎక్కి ప్రజలను సంబోధించి ఇలా అన్నారు: “రెండు ‘ముద్’ల సిరియా గోధుమలు ఒక ‘సా’ ఖర్జూరాలకు సమానము అని నేను భావిస్తున్నాను”. ప్రజలు దానిని అంగీకరించారు. అబూ సఈద్ అల్ ఖుద్రీ (ర) ఇంకా ఇలా అన్నారు: “కానీ నేను మాత్రం జీవించి ఉన్నంత కాలం ఆ విధంగానే జకాతుల్ ఫిత్ర్ తీస్తాను, ఏ విధంగానైతే నేను (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవించి ఉన్న కాలం నుండి) ఇప్పటి వరకూ తీస్తూ వచ్చినానో.”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt සිංහල ئۇيغۇرچە Hausa Português Kurdî Kiswahili অসমীয়া ગુજરાતી Nederlands മലയാളം Română Magyar ქართული Moore ಕನ್ನಡ Svenska Oromoo Македонски ไทย Українськаالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితకాలములోనూ మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత వచ్చిన ఖులఫా-ఎ-రాషిదీన్’ల కాలములోనూ ముస్లిములు, ప్రతి చిన్నవారి తరఫు నుండి (ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ప్రతి ఒక్కరి తరఫు నుండి), ప్రతి పెద్దవారి తరఫు నుండి (స్త్రీ పురుషులలో ప్రతి ఒక్కరి తరఫు నుండి) ఒక ‘సా’ ఆహార దాన్యాన్ని జకాతుల్ ఫిత్ర్’గా చెల్లించేవారు. బార్లీ, ఎండిన ద్రాక్ష (ఎండుద్రాక్ష), వెన్న (అఖ్త్), మరియు ఖర్జూరాలు ఆ ప్రజల ప్రధాన ఆహారంగా ఉండేవి. నాలుగు ‘ముద్’లు ఒక ‘సా’ కు సమానము. ఒక ఎదిగిన వ్యక్తి దోసిలి నిండా పట్టినంత పరిమాణాన్ని ఒక ‘ముద్’ అంటారు. (‘సా’ మరియు ‘ముద్’ అనేవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో ధాన్యము మొదలైన వాటిని కొలవడానికి అమలులో ఉన్న కొలమానాలు) ముఆవియా (రదియల్లాహు అన్హు) ఖలీఫాగా మదీనాకు వచ్చినపుడు సిరియాలో గోధుమలు విరివిగా వాడుకలో ఉండేవి. ప్రజలను సంబోధిస్తూ ఇచ్చిన ప్రసంగములో ఆయన “రెండు ‘ముద్’ల సిరియా గోధుమలు, ఒక ‘సా’ ఖర్జూరాలకు సమానము అని నేను భావిస్తున్నాను” అన్నారు. ప్రజలు దానిని అంగీకరించి దానిపైనే అమలు చేయడం ప్రారంభించినారు. అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఇలా అన్నారు: “నేను మాత్రం జీవించి ఉన్నంత కాలం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో ఏ విధంగా జకాతుల్ ఫిత్ర్ చెల్లిస్తూ వచ్చానో, అదే విధంగా చెల్లిస్తాను.”فوائد الحديث
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో జకాతుల్ ఫిత్ర్ ఎంత ఇవ్వబడేది అనే విషయం తెలుస్తున్నది: అది “ఒక ‘సా’ ఆహార ధాన్యము, అది ఎంత ఖరీదు గలది, ఏ రకం ఆహార ధాన్యము అనే తేడా లేకుండా.
మానవులు ఆయా ప్రాంతాలలో ఆహారంగా తినే ఏ ఆహార ధాన్యమైనా జకాతుల్ ఫిత్ర్ గా చెల్లించవచ్చు. ఈ హదీథులో నాలుగు ఆహారపదార్థాలు పేర్కొనబడినాయి – ఎందుకంటే అవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో ప్రజలు సాధారణంగా తినే ఆహారంగా ఉండేవి.
ఆహారపదార్థాలు కానివి - అంటే ఉదాహరణకు కరెన్సీ నోట్లు, నాణెములను, ధనము మొదలైనవి - జకాతుల్ ఫిత్ర్’గా పరిగణించబడవు.
“షర్హ్ ముస్లిం” పై వ్యాఖ్యానిస్తూ ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలు (సహచరులు) ఏదైనా విషయం పై భిన్నాభిప్రాయం వ్యక్తపరిచినపుడు, వారిలో కొంతమంచి అభిప్రాయం మిగతా వారి అభిప్రాయం కంటే ఉత్తమమైనది అని భావించలేము. కనుక ఆ విషయానికి సంబంధించి ఇతర ఆధారాలను చూడాలి. ఈ హదీథు యొక్క స్పష్టమైన అర్థము మరియు సారూప్యత, ఈ రెండింటి వెలుగులో చూసినపుడు (జకాతుల్ ఫిత్ర్’గా) గోధుమలను ఇచ్చేట్లయితే, ఇతర ఆహార పదార్ధాల మాదిరిగానే పూర్తిగా ఒక ‘సా’ చెల్లించాలి (సగం ‘సా’ కాదు) అనే విషయం స్పష్టమవుతున్నది. కనుక అదే అంగీకారయోగ్యము, దానినే స్వీకరించాలి.
ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు హదీసులో, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాత్మక సంప్రదాయాలకు (హదీథులకు) కట్టుబడి ఉండేవారని మరియు వాటిని పాటించేవారని మరియు గద్యము రూపములో (వచన రూపములో) రుజువు ఉన్నప్పుడు వ్యక్తిగత తార్కికతను (ఇజ్’తిహాద్ ను) ఆశ్రయించకుండా ఉండేవారని మనకు ఆధారాలు ఉన్నాయి. అలాగే ముఆవియారజియల్లాహు అన్హు ఏమి చేసారు, దానిని ప్రజలు అంగీకరించడాన్ని గురించి చూసినట్లయితే – ఇది ఇస్లాం లో “ఇజ్’తిహాద్”కు (ఖుర్’ఆన్ మరియు హదీథుల వెలుగులో ఏదైనా విషయం పై ఙ్ఞానపూర్వకమైన తార్కిక నిర్ణయానికి రావడం) అనుమతి ఉన్నది అనే విషయాన్ని తెలియజేస్తున్నది. ఇది ప్రశంసనీయము కూడా. అయితే ఏదైనా విషయం పై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్పష్టమైన హదీథులు ఉన్నపుడు ఆ విషయంపై చేయబడిన “ఇజ్తిహాద్” చెల్లదు.
التصنيفات
జకాతుల్ ఫితర్