إعدادات العرض
“నిశ్చయంగా అల్లాహ్ నాకు ఈ విధంగా వహీ చేసినాడు (దివ్యజ్ఞానాన్ని అవతరింపజేసినాడు) – ఎవరూ ఒకరిపై మరొకరు గొప్పలు…
“నిశ్చయంగా అల్లాహ్ నాకు ఈ విధంగా వహీ చేసినాడు (దివ్యజ్ఞానాన్ని అవతరింపజేసినాడు) – ఎవరూ ఒకరిపై మరొకరు గొప్పలు చెప్పుకోకండి, మరియు ఎవరూ ఒకరిని మరొకరు అణచివేతకు గురిచేయకండి.”
బనీ ముజాషీ తెగ సోదరుడైన ఇయాద్ ఇబ్న్ హిమార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్యన ఒక ప్రసంగకర్తగా నిలబడి ఇలా అన్నారు:” ఇయాద్ ఇబ్న్ హిమార్ (రదియల్లాహు అన్హు) ఆ హదీథును వివరించినారు; అందులో ఇలా ఉన్నది: “నిశ్చయంగా అల్లాహ్ నాకు ఈ విధంగా వహీ చేసినాడు (దివ్యజ్ఞానాన్ని అవతరింపజేసినాడు) – ఎవరూ ఒకరిపై మరొకరు గొప్పలు చెప్పుకోకండి, మరియు ఎవరూ ఒకరిని మరొకరు అణచివేతకు గురిచేయకండి.”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Tiếng Việt Hausa Kurdî Magyar ქართული Kiswahili සිංහල Română অসমীয়া ไทย Português मराठी دری አማርኛ ភាសាខ្មែរ Nederlands Македонски ગુજરાતી ਪੰਜਾਬੀ മലയാളം ಕನ್ನಡالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను సంబోధిస్తూ ప్రసంగించినారు – ఆ ప్రసంగములో మిగతా విషయాలతో పాటు వారు ఇలా అన్నారు: నిశ్చయంగా అల్లాహ్ తనపై ఈ విధంగా దివ్యఙ్ఞానాన్ని అవతరింపజేసినాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినారు: ప్రజలు పరస్పరం వినయంతో మెలగాలి, ఇతరుల కొరకు తమ రెక్కలు వంచి, సౌమ్యంగా ఉండాలి. తద్వారా ఎవరూ తమ వంశపారంపర్యత, సంపద లేదా మరే విషయం ఆధారంగానైనా గొప్పతనం, గర్వం లేదా గౌరవం గురించి గొప్పలు చెప్పుకోరాదు; మరియు ఎవరూ ఎవరినీ అణచివేయరాదు లేదా అతిక్రమించరాదు.فوائد الحديث
ఈ హదీథు వినయాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ప్రజల పట్ల అహంకారం మరియు గర్వాన్ని కలిగి ఉండడాన్ని నివారిస్తుంది.
ఇది అతిక్రమణ, అణచివేత మరియు అహంభావాన్ని కూడా నిషేధిస్తుంది.
అల్లాహ్ పట్ల వినయం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి:
మొదటి అర్థం ఏమిటంటే: మీరు అల్లాహ్ యొక్క ధర్మం పట్ల వినయంగా ఉంటారు, దాని పట్ల లేదా దాని నియమాల పట్ల అహంకారంతో ఉండరు.
రెండవ అర్థం ఏమిటంటే: మీరు అల్లాహ్ యొక్క దాసుల పట్ల కేవలం అల్లాహ్ కొరకు వినయంగా ఉంటారు, వారి పట్ల భయంతో లేదా వారు కలిగి ఉన్న వాటిపై ఆశతో కాదు, కానీ కేవలం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కోసం మాత్రమే.
