“తన వలీ (సంరక్షకుల) అనుమతి లేకుండా వివాహం చేసుకున్న స్త్రీ వివాహం చెల్లదు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ…

“తన వలీ (సంరక్షకుల) అనుమతి లేకుండా వివాహం చేసుకున్న స్త్రీ వివాహం చెల్లదు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాటలను మూడుసార్లు పలికినారు. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఒకవేళ భర్త ఆమెతో సంబోగములో పాల్గొని ఉంటే, అతడు ఆమె నుండి ఏదైతే పొందినాడో, అందుకు గానూ ఆమెకు వరకట్నం లభిస్తుంది. వారి మధ్య ఏదైనా వివాదం తలెత్తితే, సుల్తాన్ (అధికారంలో ఉన్న వ్యక్తి, ఆ ఇద్దరిలో) సంరక్షకుడు ఎవరూ లేని వ్యక్తికి సంరక్షకుడు అవుతాడు.”

విశ్వాసుల మాతృమూర్తి, ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “తన వలీ (సంరక్షకుల) అనుమతి లేకుండా వివాహం చేసుకున్న స్త్రీ వివాహం చెల్లదు అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ మాటలను మూడుసార్లు పలికినారు. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఒకవేళ భర్త ఆమెతో సంబోగములో పాల్గొని ఉంటే, అతడు ఆమె నుండి ఏదైతే పొందినాడో, అందుకు గానూ ఆమెకు వరకట్నం లభిస్తుంది. వారి మధ్య ఏదైనా వివాదం తలెత్తితే, సుల్తాన్ (అధికారంలో ఉన్న వ్యక్తి, ఆ ఇద్దరిలో) సంరక్షకుడు ఎవరూ లేని వ్యక్తికి సంరక్షకుడు అవుతాడు.”

[దృఢమైనది]

الشرح

తన సంరక్షకుల అనుమతి లేకుండా స్త్రీ తనకు తానుగా వివాహం చేసుకునే స్త్రీకి వ్యతిరేకంగా, “ఆమె వివాహం చెల్లదు” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం హెచ్చరించారు. “చెల్లదు” అని ఆయన మూడుసార్లు పునరావృతం చేసారు; అసలు ఎన్నడూ అలా జరుగకూడదు అన్నట్లుగా. ఆమెను వివాహం చేసుకున్న వ్యక్తి, ఆమె సంరక్షకుల సమ్మతి, అంగీకారం లేకపోయినా ఆమెతో సంబోగములో పాల్గొన్నట్లయితే ఆమె యోనితో అతను లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు నిర్ణయించబడిన వరకట్నం పూర్తిగా ఆమెదే అవుతుంది (ఆమె సంరక్షకులకు అందునుండి ఏమీ చెందదు). వివాహ ఒప్పందం యొక్క సంరక్షకత్వంపై సంరక్షకుల మధ్య వివాదం ఏర్పడితే - మరియు ఈ విషయంలో వారందరూ సమాన స్థాయిలో ఉంటే – ఒప్పందం కొరకు వారిలో ఎవరు మొదట ముందడుగు వేసినారో వారికే వెళుతుంది, అయితే అది అన్ని కోణాలలో ఆమె శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని జరుగుతుంది. సంరక్షకుడు ఆమెను అతనికిచ్చి వివాహం చేయడానికి నిరాకరిస్తే, ఆమెకు సంరక్షకుడు ఎవరూ లేనట్లే; ఈ సందర్భంలో, పాలకుడు లేదా అతని ప్రతినిధి, అంటే న్యాయమూర్తి మరియు అలాంటి వారు ఆమెకు సంరక్షకుడిగా మారతారు. చట్టబద్ధమైన సంరక్షకుడు ఉంటే పాలకుడికి సంరక్షకత్వం ఉండదు.

فوائد الحديث

వివాహం చెల్లుబాటు కావడానికి షరియత్ అనుమతించిన సంరక్షకుడు ఉండడం ఒక షరతు. ఈ విషయం లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహబాలలో ఎవరికీ భిన్నమైన అభిప్రాయం లేదని ఇమాం ఇబ్న్ అల్-ముందిర్ పేర్కొన్నారు.

షరియత్ ప్రకారం చెల్లని వివాహం జరిగినట్లయితే, ఆమెతో భర్త లైంగిక సంబంధం పెట్టుకున్నందుకు ప్రతిఫలంగా నిర్ణయించబడిన కట్నం పూర్తిగా పొందే హక్కు ఆమె కలిగి ఉంటుంది.

సంరక్షకుడు లేని స్త్రీకి అక్కడి పాలకుడు ఆమె సంరక్షకుడు అవుతాడు. సంరక్షకుడు లేకపోవడం అంటే అసలు ఎటువంటి సంరక్షకుడూ కూడా లేకపోవడం, లేదా ఉన్న సంరక్షకుడు ఆ వివాహనికి అంగీకరించకపోవడం.

సంరక్షకుడు లేనప్పుడు లేదా సంరక్షకుడు తన పాత్రను నిర్వర్తించలేకపోతే, అక్కడి పాలకుడు సంరక్షకుడు లేని ఎవరికైనా సంరక్షకుడిగా పరిగణించబడతాడు. అటువంటి విషయాలలో అక్కడి న్యాయమూర్తి పాలకుడి తరపున వ్యవహరిస్తాడు, ఎందుకంటే అతను పాలకుడికి ప్రతినిధిగా ఉంటాడు.

స్త్రీ వివాహం విషయంలో సంరక్షకుడి సంరక్షకత్వం ఉండడం తప్పని సరి, అంటే ఆమెకు ఎటువంటి హక్కు లేదని కాదు దాని అర్థం; ఆమెకు ఒక హక్కు ఉంది, ఆమె అనుమతి లేకుండా ఆమె సంరక్షకుడు ఆమెను తనకు ఇష్టమైన వాడికి ఇచ్చి వివాహం చేయుట అనుమతించబడదు.

చెల్లుబాటు అయ్యే వివాహం యొక్క నిబంధనలు: మొదటిది: జీవిత భాగస్వాములలో ప్రతి ఒక్కరినీ సూచన ద్వారా, లేదా వారి పేర్ల ద్వారా, లేదా వారి వివరాల ద్వారా నిర్ధారించడం; రెండవది: వివాహం చేసుకోబోయే ఇద్దరి పరస్పర అంగీకారం ఉండడం; మూడవది: స్త్రీ తరఫున ఆమె సంరక్షకుడు ఆ వివాహ ఒప్పందాన్ని పరిపూర్ణం గావించడం; నాలుగవది: ఆ వివాహ ఒప్పందానికి నిర్ణీత సాక్షులు సాక్ష్యం చెప్పడం.

వివాహ ఒప్పందాన్ని ముగించే సంరక్షకుడు నెరవేర్చాల్సిన షరతులు: : 1. మతిస్థిమితము కలిగిన వాడై ఉండాలి, 2. సంరక్షకుడుగా పురుషుడు ఉండాలి, 3. యుక్తవయస్సుకు చేరిన వాడై ఉండాలి, అంటే పదిహేను సంవత్సరాల వయస్సు చేరుకోవడం లేదా లైంగిక పరిపక్వతకు చేరుకోవడం. 4. ఒకే ధర్మానికి చెందిన వాడై ఉండాలి, అంటే ఏ అవిశ్వాసి కూడా ముస్లిం పురుషునిపై లేదా ముస్లిం స్త్రీ పై సంరక్షకత్వానికి అర్హుడు కాడు, అదే విధంగా ఏ ముస్లిం పురుషుడు లేదా స్త్రీ అవిశ్వాసిపై సంరక్షకత్వానికి అర్హులు కాదు. 5. నిజాయితీ పరుడై ఉండాలి, అంటే అల్లాహ్ యొక్క విధేయతకు విరుద్ధంగా ఉండే వాడై ఉండరాదు; ఈ సందర్భములో నిజాయితీ పరుడై ఉండాలి అంటే అతను బాధ్యత వహించే స్త్రీ యొక్క వివాహం పట్ల ఆమె ఉత్తమ ప్రయోజనాలను నిర్ధారించే ఉద్దేశ్యంతో అతడు వ్యవహరించడం సరిపోతుంది. 6. వివేకం కలిగిన వాడై ఉండాలి, అంటే మూర్ఖంగా వ్యవహరించే వ్యక్తి అయి ఉండరాదు, అంటే వరుడు అన్ని విధాలా అనుకూలతలు కలిగిన వాడేనా, తగినవాడేనా అని గుర్తించే సామర్థ్యం మరియు వివాహంలో ఉన్న మంచిచెడులను, ఆసక్తులను అర్థం చేసుకునే సామర్థ్యం కలిగిన వాడై ఉండడం.

ఇస్లామీయ ధర్మవేత్తలు, న్యాయనిపుణుల ప్రకారం వివాహంలో స్త్రీ సంరక్షకులకు సంబంధించి ఒక క్రమం ఉంటుంది. బంధుత్వములో దగ్గరి సంరక్షకుడు లేనప్పుడు లేదా సంరక్షకుడు నెరవేర్చాల్సిన షరతులను ఆ సంరక్షకుడు నెరవేర్చనపుడు, లేదా నెరవేర్చే పరిస్థితులు లేనప్పుడు తప్ప, అతడిని పక్కన బెట్టడం అనుమతించబడదు. ఆ స్త్రీకి సంబంధించి సంరక్షకుడు ఎవరంటే ఆమె తండ్రి, తరువాత ఆమె కోసం సంరక్షకునిగా అతను నియమించిన వ్యక్తి, తరువాత ఆమె తండ్రి తరఫున తాత (తండ్రి యొక్క తండ్రి) ఇది తండ్రితరఫున పూర్వీకులందరి వరకు ఎవరైనా ఆమె సంరక్షకులు కావచ్చు; తరువాత ఆమె కుమారుడు, తరువాత అతని కుమారులు (అంటే ఆమె మనుమలు) వారసుల వరకు, తరువాత ఆమె స్వంత సోదరుడు, తరువాత తండ్రి వైపు నుండి ఆమె సవతి సోదరుడు (తన తండ్రి ద్వారా అతని మరో భార్యకు జన్మించిన కుమారులు); తరువాత ఆ సోదరుల కుమారులు; తరువాత ఆమె కన్న తండ్రి సోదరులు, మరియు ప్రస్తుతం ఉన్న తండ్రి (ప్రస్తుతం తన తల్లి భర్త) సోదరులు; తరువాత వారి కుమారులు, తరువాత ఆమె 'అసబా' నుండి అత్యంత సన్నిహిత పురుష బంధువు (అంటే వారసత్వంలో వాటా కలిగిన పురుష బంధువులు); తరువాత ముస్లిం పాలకుడు లేదా అతని ప్రతినిధి సంరక్షకుడు లేని వారికి సంరక్షకుడు అవుతాడు (ఇక్కడ పాలకుని ప్రతినిధి అంటే ఉదాహరణకు ఆ ప్రాంతపు న్యాయమూర్తి ఖాదీ)

التصنيفات

నికాహ్ (వివాహం)