“ఖుర్’ఆన్ పఠించే విశ్వాసి యొక్క ఉపమానము దబ్బపండు వంటిది; దాని వాసనా మంచిగా ఉంటుంది మరియు రుచి కూడా మంచిగా…

“ఖుర్’ఆన్ పఠించే విశ్వాసి యొక్క ఉపమానము దబ్బపండు వంటిది; దాని వాసనా మంచిగా ఉంటుంది మరియు రుచి కూడా మంచిగా ఉంటుంది. ఖుర్’ఆన్ పఠించని విశ్వాసి యొక్క ఉపమానము ఖర్జూరము వంటిది; దానికి వాసన ఉండదు, కానీ రుచి తీయగా ఉంటుంది

అబూ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఖుర్’ఆన్ పఠించే విశ్వాసి యొక్క ఉపమానము దబ్బపండు వంటిది; దాని వాసనా మంచిగా ఉంటుంది మరియు రుచి కూడా మంచిగా ఉంటుంది. ఖుర్’ఆన్ పఠించని విశ్వాసి యొక్క ఉపమానము ఖర్జూరము వంటిది; దానికి వాసన ఉండదు, కానీ రుచి తీయగా ఉంటుంది. ఖుర్’ఆన్ పఠించే కపట విశ్వాసి ఉపమానము సబ్జా మొక్క వంటిది, దానికి మంచి వాసన ఉంటుంది, కానీ దాని రుచి చేదుగా ఉంటుంది; అలాగే ఖుర్’ఆన్ పఠించని కపట విశ్వాసి ఉపమానము చేదు పుచ్చకాయ వంటిది, దానికి ఎటువంటి వాసనా ఉండదు, పైగా దాని రుచి చేదుగా ఉంటుంది.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్’ఆన్ పఠించి దాని నుండి ప్రయోజనం పొందే ప్రజల వర్గాలను గురించి వివరించారు. మొదటి వర్గము: ఖుర్’ఆన్ పఠించి దాని నుండి ప్రయోజనం పొందే విశ్వాసి: అతడు దబ్బపండు లాంటి వాడు. అది మంచి రుచి, మంచి సువాసన, సుందరమైన వర్ణము కలిగి ఉంటుంది. దాని ప్రయోజనాలు అనేకం. అతడు తాను చదివిన దానిని ఆచరిస్తాడు, దానిని అమలు చేస్తాడు. అతడి వలన అల్లాహ్ యొక్క దాసులకు ప్రయోజనం చేకూరుతుంది. రెండవ వర్గము: ఖుర్’ఆన్ పఠించని విశ్వాసి : ఖురాన్ పఠించని విశ్వాసి మధురమైన రుచి కలిగి ఉన్నా వాసన లేని ఖర్జూరం లాంటివాడు. ఖర్జూరం రుచిలో మధురంగా ఉండి, దాని తీపి లోపలి వరకూ కలిగి ఉటుంది, అలాగే అతని హృదయం విశ్వాసాన్ని కలిగి ఉంటుంది. అది సువాసన లేని మధురమైన ఖర్జూరము వంటిది. అతని నుండి ఖుర్’ఆన్ పారాయణం వినబడినందున, ప్రజలు సంత్వన పొందరు. మూడో వర్గం: ఖుర్ఆన్ పఠించే కపటవిశ్వాసి: అతడు సబ్జా మొక్క లాంటి వాడు. దాని వాసన బాగుంటుంది, కానీ రుచి చేదుగా ఉంటుంది. ఎందుకంటే అతను తన హృదయాన్ని విశ్వాసంతో సంస్కరించలేదు లేదా ఖుర్ఆన్ ప్రకారం ఆచరించలేదు. ప్రజల ముందు బయటకు అతడు విశ్వాసిలా కనిపిస్తాడు. వాసన మంచిగా ఉంటుంది అనే పోలిక అతని ఖుర్’ఆన్ పఠనాన్ని సూచిస్తుంది, రుచి చేదుగా ఉంటుంది అనే పోలిక అతని అవిశ్వాసాన్ని సూచిస్తుంది. నాల్గవ వర్గం: ఖుర్ఆన్ పఠించని కపటవిశ్వాసి: అతడు చేదు పుచ్చకాయ వంటివాడు. దానికి వాసనా ఉండదు, పైగా చేదుగా ఉంటుంది. ‘ఏ వాసనా ఉండదు’ అనే పోలిక అతడు ఖుర్’ఆన్ పఠించకపోవడాన్ని సూచిస్తుంది, ‘పైగా చేదుగా ఉంటుంది’ అనే పోలిక అతని లోని అవిశ్వాసపు చేదును సూచిస్తుంది. అతడి అంతరంగము విశ్వాసలేమితో శూన్యంగా ఉంటుంది, అతడి బహిరంగము (ఉమ్మత్’కు) ఎటువంటి ఉపయోగం లేనిది, పైగా హానికరమైనది.

فوائد الحديث

ఇందులో ఖుర్’ఆన్’తో అనునిత్యము సాంగత్యము కలిగి ఉండి, దాని పై ఆచరించే వాని ఘనత తెలియుచున్నది.

ఏదైనా విషయాన్ని బోధించే విధానాలలో ఒకటి ఉపమానాలు ఉపయోగించి బోధించడం; అది విషయావగాహనను మరింత చేరువ చేస్తుంది.

ఒక ముస్లిం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ గ్రంథాన్ని క్రమం తప్పకుండా (రెగ్యులర్’గా) కొద్ది భాగాన్నైనా నిరంతరం పఠించాలి.

التصنيفات

ఖుర్ఆన్ పట్ల శ్రద్ధ వహించటం యొక్క ప్రాముఖ్యత.