.

ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎప్పుడైనా రెండు విషయాల మధ్య ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తే, అది పాపం కానంత వరకు, వారు సులభమైన దాన్నే ఎంచుకునే వారు. ఒకవేళ అది పాపమైతే, ఆయన దాని నుండి ఎంతో దూరంగా ఉండేవారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కోసం ఎన్నడూ ప్రతీకారం తీర్చుకోలేదు - కానీ అల్లాహ్ పవిత్రత ఉల్లంఘించబడినప్పుడు మాత్రం, ఆయన అల్లాహ్ కోసం ప్రతీకారం తీసుకునేవారు."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

"విశ్వాసుల మాతృమూర్తి అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సద్గుణాలను వివరిస్తూ ఇలా చెప్పినారు: 'ఆయనకు ఎప్పుడైనా రెండు విషయాల మధ్య ఎంపిక చేసుకునే అవకాశం లభించినప్పుడు, సులభమైన దాన్నే ఎంచుకునేవారు - అది పాపానికి దారి తీసేది కాకపోతే. ఒకవేళ అది పాపమైతే, దాని నుండి అత్యంత దూరంగా ఉండేవారు. అటువంటి సందర్భాలలో ఆయన కఠినమైన మార్గాన్నే ఎంచుకునేవారు.'" ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన వ్యక్తిగత హక్కుల కోసం ఎన్నడూ ప్రతీకారం తీసుకోలేదు. ఆయన ఎల్లప్పుడూ క్షమించే స్వభావం కలిగి ఉండేవారు. కానీ అల్లాహ్ పవిత్ర హద్దులు ఉల్లంఘించబడినప్పుడు మాత్రమే, ఆయన అల్లాహ్ కోసం ప్రతీకారం తీసుకునేవారు. ఆయన అల్లాహ్ కోసం అత్యంత కోపంతో ప్రతిస్పందించే వ్యక్తి."

فوائد الحديث

ఏ పనిలోనైనా సులభమైన మార్గాన్నే ఎంచుకోవడం సున్నత్ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచారం), అది పాపం కానంత వరకు.

ఇస్లాం సులభమైన ధర్మం.

అల్లాహ్ కోసం కోపగించడం ఇస్లాంలో న్యాయబద్ధమైనది.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసాధారణమైన సహనం మరియు సాత్వికత (హిల్మ్) కలిగి ఉండేవారు. అయితే, అల్లాహ్ హద్దులను (ఇస్లామీయ పరిమితులు) అమలు చేయడంలో ఆయన ఎల్లప్పుడూ న్యాయంతో కూడిన దృఢత్వం చూపించేవారు.

ఇబ్నె హజర్ చెప్పినారు: "ఈ విషయములో కఠినమైన విషయాన్ని వదిలేసి, సులభమైనదానితో సంతృప్తి చెందడం, మరియు అవసరం లేని విషయాల్లో ఆగ్రహం లేదా అనవసరమైన ఒత్తిడి చేయడం వదులుకోవడం అనేది కూడా ఉందంటారు."

అల్లాహ్ హక్కులను మినహాయించి, ఇతర విషయాల్లో క్షమించడాన్ని ప్రోత్సహించడం.

التصنيفات

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధైర్యం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓర్పు