“మీ సంపదలతో, మీ ఆత్మలతో (అంటే మీ ప్రాణాలు పణంగా పెట్టి), మరియు మీ నాలుకలతో బహుదైవారాధకులతో పోరాడండి.”

“మీ సంపదలతో, మీ ఆత్మలతో (అంటే మీ ప్రాణాలు పణంగా పెట్టి), మరియు మీ నాలుకలతో బహుదైవారాధకులతో పోరాడండి.”

అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సంపదలతో, మీ ఆత్మలతో (అంటే మీ ప్రాణాలు పణంగా పెట్టి), మరియు మీ నాలుకలతో బహుదైవారాధకులతో పోరాడండి.”

[దృఢమైనది] [رواه أبو داود والنسائي وأحمد]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: అల్లాహ్ యొక్క వాక్కు సర్వోన్నతమైనదిగా ఉండేలా సత్యతిరస్కారులకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి పద్ధతిలో వారిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాలని ఆదేశించారు, వాటిలో: మొదటిది: అవిశ్వాసులతో పోరాడుట కొరకు యోధులకు ఆయుధాలను సమకూర్చుట కొరకు, మరియు సైనికులపై ఖర్చు చేయుట కొరకు మన సంపదను ఖర్చు చేయాలి. రెండవది: సత్యతిరస్కారులను ఎదిరించడానికి, యుద్ధములో వారిని అధిగమించడానికి స్వయంగా నడుం బిగించి ముందుకు కదలాలి. మూడవది: వారిని మౌఖిక మార్గాల ద్వారా ఇస్లాం వైపు ఆహ్వానించడం, వారికి వ్యతిరేకంగా సత్యాన్ని స్థాపించడం, వారి వాదనలను ఖండించడం మరియు వారి వాదనలను తిరస్కరించడం.

فوائد الحديث

ఈ హదీథులో బహుదైవారాధకులకు వ్యతిరేకంగా జిహాద్‌ను ప్రోత్సహించడం కనిపిస్తుంది, ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం ప్రకారం వారు స్వయంగా జిహాద్ కొరకు బయలుదేరాలి, జిహాద్ కొరకు సంపదను ఖర్చు చేయాలి మరియు బహుదైవారాధకులతో సంవాదము జరుపడం, వారిని ఇస్లాం బోధనల వైపునకు ఆహ్వానించడం మొదలైన విధానాల ద్వారా ప్రయత్నించాలి. జిహాద్ శారీరక పోరాటానికి మాత్రమే పరిమితం కాదు.

జిహాద్ విషయానికి వస్తే షరియత్ యొక్క ఆదేశం ఏమిటంటే – అది వాజిబ్ (విధి). అది ప్రతి ఒక్కరిపై వ్యక్తిగతంగా విధి కావచ్చు, లేక సామూహికంగా విశ్వాసులందరిపై విధి కావచ్చు.

అల్లాహ్ జిహాద్‌ను అనేక కారణాల వల్ల ఆదేశించినాడు, వాటిలో:

మొదటిది: బహుదైవారాధనను మరియు బహుదైవారాధకులను వ్యతిరేకించడం, ఎందుకంటే బహుదైవారాధనను అల్లాహ్ ఎన్నడూ అంగీకరించడు. రెండవది: అల్లాహ్ వైపునకు, ఆయన సందేశం వైపునకు పిలవడానికి అడ్డుగా ఉన్న ఆటంకాలను తొలగించడం. మూడవది: అల్లాహ్ పట్ల, ఆయన ధర్మం పట్ల విశ్వాసాన్ని వ్యతిరేకించే ప్రతిదాని నుండి రక్షించడం. నాల్గవది: ముస్లింలను, వారి మాతృభూమిని, వారి గౌరవాన్ని మరియు వారి సంపదలను రక్షించడం.

التصنيفات

ధర్మపోరాట ఆదేశం