నీవు నీ పూర్వపు మంచిపనులతో సహా ఇస్లాంను స్వీకరించినావు” అన్నారు

నీవు నీ పూర్వపు మంచిపనులతో సహా ఇస్లాంను స్వీకరించినావు” అన్నారు

హాకిం ఇబ్న్ హిజాం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నేను అఙ్ఞానపు కాలములో (ఇస్లాం స్వీకరించక ముందు కాలములో) పేదవారికి దానము చేయుట, బానిసలకు విముక్తి కలిగించుట, బంధువులను ఆదరించుట, వారితో బంధుత్వాలను కొనసాగించుట మొదలైన మంచిపనులు చేస్తూ ఉండేవాడిని. మరి నాకు ఆ మంచిపనుల ప్రతిఫలం లభిస్తుందా?” దానికి ఆయన “నీవు నీ పూర్వపు మంచిపనులతో సహా ఇస్లాంను స్వీకరించినావు” అన్నారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒకవేళ ఎవరైనా అవిశ్వాసి ఇస్లాం స్వీకరించి విశ్వాసిగా మారితే, అతడు అవిశ్వాసిగా గడిపిన తన పూర్వపు జీవితములో చేసిన మంచిపనులకు కూడా అంటే దానము చేయుట, బానిసలకు విముక్తి కల్పించుట, బంధుత్వాలను గౌరవించుట, ఆదరించుట, కొనసాగించుట మొదలైన వాటికి కూడా ప్రతిఫలం పొందుతాడు.

فوائد الحديث

ఒక అవిశ్వాసి, అవిశ్వాసములోనే చనిపోతే, అతడు ఈ ప్రాపంచిక జీవితములో చేసిన మంచిపనులకు పరలోకములో ప్రతిఫలము ఏమీ లభించదు.

التصنيفات

ఇస్లాం