“చిత్తశుధ్ధి (నైతిక నిష్ట, న్యాయవర్తన) లేని వానికి విశ్వాసం లేదు; మరియు (ఇతరులతో) తనకు ఉన్న ఒడంబడికను పాటించని…

“చిత్తశుధ్ధి (నైతిక నిష్ట, న్యాయవర్తన) లేని వానికి విశ్వాసం లేదు; మరియు (ఇతరులతో) తనకు ఉన్న ఒడంబడికను పాటించని వ్యక్తికి ధర్మం లేదు.”

అనస్ ఇబ్నె మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మమ్ములను ఉద్దేశ్యించి ఎప్పుడు ప్రసంగించినా ఇలా అనకుండా ఎప్పుడూ లేరు: “చిత్తశుధ్ధి (నైతిక నిష్ట, న్యాయవర్తన) లేని వానికి విశ్వాసం లేదు; మరియు (ఇతరులతో) తనకు ఉన్న ఒడంబడికను పాటించని వ్యక్తికి ధర్మం లేదు.”

[పరా ప్రామాణికమైనది] [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు]

الشرح

అనస్ ఇబ్నె మాలిక్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) రెండు విషయాలను ప్రస్తావించకుండా ఉపన్యాసం లేదా ఉపదేశాన్ని ఇవ్వడం చాలా అరుదు. మొదటిది: ఎవరి విషయంలోనైనా - అతని సంపద, లేదా అతని కుటుంబము విషయంలో ద్రోహం చేయాలనే తలంపు మనసులో ఉన్న వ్యక్తికి పూర్తి విశ్వాసం ఉండదు. రెండవది: ఇతరులతో తనకు ఉన్న, లేదా ఇతరులతో తాను చేసుకున్న ఒప్పందాలను, ఒడంబడికను పాటించని వ్యక్తికి సంపూర్ణమైన ధర్మము లేదు.

فوائد الحديث

ఈ హదీథు ‘అమానతులను’ (మనపై నమ్మకం మరియు విశ్వాసముతో ఇతరులు మనవద్ద ఉంచిన వారి సంపదలు, విషయములు మొ. ద్రోహానికి పాల్బడకుండా వాటిని) నెరవేర్చడం; ఇతరులతో మనకు ఉన్న ఒడంబడికలు మరియు ఒప్పందాలను పాటించడం పట్ల ప్రోత్సహిస్తున్నది, ఎందుకంటే వాటిని నెరవేర్చకపోవడం నమ్మకాన్ని విశ్వాసాన్ని రూపుమాపుతుంది, కోల్పోయేలా చేస్తుంది.

ఇందులో నమ్మక ద్రోహానికి వ్యతిరేకంగా మరియు ఒడంబడికలను ఉల్లంఘించడానికి వ్యతిరేకంగా హెచ్చరిక ఉన్నది, ఎందుకంటే ఇవి పెద్ద పాపాలు.

ఈ హదీసులో అల్లాహ్’కు మరియు ఆయన దాసునికి మధ్య, మరియు సృష్టికి మధ్య ఉన్న నమ్మకాలను మరియు ఒడంబడికలను కాపాడటం ఉన్నది.

التصنيفات

సద్గుణాలు