“స్వర్గవాసులు స్వర్గములోనికి ప్రవేశించిన తరువాత సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారిని ఇలా అడుగుతాడు: “నేను మీకు…

“స్వర్గవాసులు స్వర్గములోనికి ప్రవేశించిన తరువాత సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారిని ఇలా అడుగుతాడు: “నేను మీకు ఇంకా ఏమైనా ప్రసాదించాలని కోరుకుంటున్నారా?”

సుహైబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “స్వర్గవాసులు స్వర్గములోనికి ప్రవేశించిన తరువాత సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారిని ఇలా అడుగుతాడు: “నేను మీకు ఇంకా ఏమైనా ప్రసాదించాలని కోరుకుంటున్నారా?” దానికి వారు ఇలా సమాధానమిస్తారు: “(ఓ అల్లాహ్!) నీవు మా ముఖాలను ప్రకాశవంతం చేయలేదా? నీవు మమ్ములను స్వర్గములోనికి ప్రవేశింపజేసి మమ్ములను నరకాగ్ని నుండి కాపాడలేదా? అపుడు అల్లాహ్ (తనకు, వారికీ మధ్య ఉన్న) పరదాను తొలగిస్తాడు. అప్పుడు వారు సర్వశక్తిమంతుడైన తమ ప్రభువును చూస్తారు. అప్పుడు వారికి సర్వశక్తిమంతుడైన తమ ప్రభువు దర్శన భాగ్యం కంటే గొప్ప అనుగ్రహం మరొకటి కనిపించదు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: స్వర్గవాసులు స్వర్గములోనికి ప్రవేశించిన తరువాత అల్లాహ్ వారితో ఇలా అంటాడు: మీకు ఇంకా ఏమైనా కావాలా? అప్పుడు స్వర్గవాసులందరూ ముక్త కంఠముతో “(ఓ అల్లాహ్!) నీవు మా ముఖాలను తెల్లగా (మెరిసిపోయేలా) చేయలేదా? మమ్ములను స్వర్గములోనికి ప్రవేశింపజేసి, నరకాగ్ని నుండి రక్షించలేదా?” అంటారు. అప్పుడు అల్లాహ్ అడ్డుగా ఉన్న తెరను తొలగించి దానిని పైకి లేపివేస్తాడు. ఆయన యొక్క తెర ఒక ప్రకాశవంతమైన కాంతి. అప్పుడు స్వర్గవాసులకు తమ ప్రభువు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుని చూడడం కంటే అత్యంత ప్రియమైనది ఏదీ ఉండదు.

فوائد الحديث

స్వర్గవాసుల నుండి (అల్లాహ్’కు) అడ్డుగా ఉన్న తెర తొలగించబడుతుంది వారు తమ ప్రభువును చూచుటకు గాను. అవిశ్వాసులు ఈ శుభామును పొందరు.

స్వర్గములో విశ్వాసులకు అన్నింటి కంటే అత్యంత మహత్తరమైన ఆనందం వారు తమ ప్రభువును కనులారా చూడడమే.

స్వర్గం యొక్క ప్రజలందరూ, వారి స్థితి, స్థాయి ఎంత భిన్నంగా ఉన్నా, స్వర్గములో వారు ఎక్కడ ఉన్నా సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన వారి ప్రభువును వారు కనులారా చూస్తారు.

వారిని స్వర్గములోని ప్రవేశింపజేయడం అనేది వారిపై అల్లాహ్ యొక్క అనుగ్రహం.

ఇందులో మంచి పనులు చేయడం ద్వారా మరియు సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరుడైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయులై ఉండుట ద్వారా స్వర్గములోని ప్రవేశించడానికి తొందర పడాలనే హితబోధ, మరియు దాని ప్రాముఖ్యత ఉన్నది.

التصنيفات

స్వర్గము,నరకము యొక్క లక్షణాలు