“సముద్రపు నీరు పరిశుద్ధమైనది, మరియు చనిపోయిన సముద్రపు జంతువులు తినుటకు అనుమతించబడినవి.”

“సముద్రపు నీరు పరిశుద్ధమైనది, మరియు చనిపోయిన సముద్రపు జంతువులు తినుటకు అనుమతించబడినవి.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక వ్యక్తి ఇలా అడిగాడు: “ఓ రసూలల్లాహ్! మేము సముద్రంపై ప్రయాణిస్తూ ఉంటాము. మేము మా వెంట పరిమితంగా మంచి నీళ్ళు తీసుకు వెళుతాము. మేము ఆ నీటితో ఉదూ గానీ, గుసుల్ గానీ చేసినట్లయితే (నీళ్ళు అయిపోయి) మేము దాహంతో బాధపడ వలసి వస్తుంది. మరి మేము సముద్రపు నీటితో ఉదూ, గుసుల్ చేయవచ్చునా?” దానికి రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “సముద్రపు నీరు పరిశుద్ధమైనది, మరియు చనిపోయిన సముద్రపు జంతువులు తినుటకు అనుమతించబడినవి.”

[దృఢమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక వ్యక్తి ఇలా అడిగాడు: మేము సముద్రంపై నావలలో, పడవలలో వ్యాపారం నిమిత్తం, చేపలు పట్టే నిమిత్తం ప్రయాణిస్తూ ఉంటాము. మేము మా వెంట త్రాగడానికి కొద్దిపాటి మంచి నీళ్ళు తీసుకువెళతాము. మేము ఈ మంచి నీళ్ళను ఉదూ చేయడానికి, లేదా గుసుల్ చేయడానికి ఉపయోగించినట్లయితే మా వద్ద త్రాగడానికి మంచినీళ్ళ కొరత ఏర్పడుతుంది; ఇంక మాకు ఏమీ లభించదు. సముద్రపు నీటితో ఉదూ, గుసుల్ చేయుటకు మాకు అనుమతి ఉన్నదా?” అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సముద్రపు నీటిని గురించి ఇలా అన్నారు: “దాని నీరు పరిశుద్ధమైనది మరియు పరిశుద్ధ పరుచునటువంటిది. దానితో ఉదూ మరియు గుసుల్ చేయుట అనుమతించబడినది; మరియు సముద్రం నుండి బయటకు తీసుకురాబడే (సముద్రంలో లభించే) దేనినైనా, ఉదాహరణకు చేపలు, వేల్ చేప వంటి జంతువులు మొదలైనవి, వాటిని పట్టుకొనడానికి ముందే అవి చనిపోయి సముద్రపు నీటిపై తేలియాడుతూ ఉన్నప్పటికీ, వాటిని తినుటకు అనుమతి ఉన్నది (హలాల్).

فوائد الحديث

చనిపోయిన సముద్రపు జంతువుల మాంసము తినుట హలాల్ (అనుమతించబడినది). అయితే సముద్రపు జంతువులు అంటే అవి అందులో తప్ప బయట జీవించలేనివి అని అర్థము.

ప్రశ్నించిన వ్యక్తికి అతడు అడిగిన దాని కంటే ఎక్కువగా అతనికి వివరించడం ప్రశ్నించే వానికి కలిగే ప్రయోజనాన్ని పరిపూర్ణం చేస్తుంది.

స్వచ్చమైనది ఏదైనా పడిన కారణంగా నీటి యొక్క రంగు, రుచి, వాసన ఈ మూడింటిలో ఏది మారిపోయినా – ఆ నీరు తన నిజ స్థితిలోనే మిగిలి ఉన్నత్లయితే అది శుద్ధమైన నీటిగానే పరిగణించబడుతుంది. దాని ఉప్పదనం, చల్లదనం లేక దాని వేడిలో పెరుగుదల వచ్చినా సరే.

సముద్రపు నీరు ‘హద థ్ అల్ అస్గర్’ (చిన్న మాలిన్యము) మరియు ‘హదథ్ అల్ అక్బర్’ వల్ల వ్యక్తి లోనయ్యే అశుద్ధ స్థితిని దూరం చేస్తుంది. అలాగే శుద్ధంగా ఉన్న మనిషి శరీరానికి గానీ, లేక శుద్ధంగా ఉన్న వస్త్రాలకు గానీ అంటిన మాలిన్యాలను కూడా తొలగిస్తుంది.

التصنيفات

నీళ్ల ఆదేశాలు