“ఎవరైతే “అమానహ్” (నమ్మకం, విశ్వాసం మొదలైన విషయాల) పై ప్రమాణం చేస్తారో, అతడు మాలోని వాడు కాడు.”

“ఎవరైతే “అమానహ్” (నమ్మకం, విశ్వాసం మొదలైన విషయాల) పై ప్రమాణం చేస్తారో, అతడు మాలోని వాడు కాడు.”

బురైదహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే “అమానహ్” (నమ్మకం, విశ్వాసం మొదలైన విషయాల) పై ప్రమాణం చేస్తారో, అతడు మాలోని వాడు కాడు.”

[దృఢమైనది] [رواه أبو داود وأحمد]

الشرح

ఈ హదీథులో నమ్మకము లేదా విశ్వాసము పై (అమానహ్ పై) ప్రమాణం చేయరాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించినారు, అలా చేయడాన్ని నిషేధించినారు; మరియు అలా చేసేవాడు మాలో ఒకడు కాడని కూడా హెచ్చరించారు.

فوائد الحديث

అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయడం నిషేధం, దీనిలో: నమ్మకం లేదా విశ్వాసముపై ప్రమాణం చేయడం కూడా ఒకటి, అది “అష్’షిర్క్ అల్ అస్గర్” (తక్కువస్థాయి బహుదైవారాధన) అవుతుంది.

“అల్-అమానహ్” అంటే అందులో విధేయత, ఆరాధన, ఎవరైనా మన వద్ద నమ్మకంగా ఉంచిన వారి సంపద, ధనము, భద్రత మొదలైనవి అన్నీ ఉన్నాయి.

ప్రమాణం చేయుట అనేది కేవలం అల్లాహ్ పేరుతో లేదా ఆయన పేర్లు లేదా గుణగణాలతో ప్రమాణం చేయాలి. అలాగాక ఇంకెవరి పేరుతోనైనా ప్రమాణం చేస్తే ఆ ప్రమాణం చెల్లదు.

ఇక్కడ అవాంఛనీయత అనేది అల్లాహ్ మరియు ఆయన గుణ విశేషణాలతో మాత్రమే ప్రమాణం చేయాలనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశంపై ఆధారపడి ఉండవచ్చు, అయితే “అమానత్” అనేది అల్లాహ్ యొక్క పేర్లలో ఒకటి గానీ, లేక ఆయన గుణవిషేషణాలలో ఒకటిగానీ కాదు. అది ఆయన ఆజ్ఞలలో ఒకటి మరియు ఆయన తప్పనిసరి చేసిన వాటిలో ఒకటి.

التصنيفات

బహుదైవారాధన (షిర్క్)