“యుక్తవయస్కుడైన ప్రతి ముస్లిం పురుషునిపై శుక్రవారం నాడు గుసుల్ చేయుట (తల స్నానం చేయుట) విధి; అలాగే మిస్వాక్ తో…

“యుక్తవయస్కుడైన ప్రతి ముస్లిం పురుషునిపై శుక్రవారం నాడు గుసుల్ చేయుట (తల స్నానం చేయుట) విధి; అలాగే మిస్వాక్ తో (పలుదోము పుల్లతో) పళ్ళు శుబ్రపరుచుకొనుట మరియు అందుబాటులో ఉన్నట్లయితే అత్తరు పూసుకొనుట కూడా.”

అమ్ర్ బిన్ సులైమ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “అబూ సయీద్ ఇలా అన్నారని నేను సాక్ష్యమిస్తున్నాను: అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని నేను సాక్ష్యమిచ్చి చెబుతున్నాను: వారు ఇలా అన్నారు: “యుక్తవయస్కుడైన ప్రతి ముస్లిం పురుషునిపై శుక్రవారం నాడు గుసుల్ చేయుట (తల స్నానం చేయుట) విధి; అలాగే మిస్వాక్ తో (పలుదోము పుల్లతో) పళ్ళు శుబ్రపరుచుకొనుట మరియు అందుబాటులో ఉన్నట్లయితే అత్తరు పూసుకొనుట కూడా.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - శుక్రవారము నాటి సలాహ్ ఆచరించుట ఎవరెవరిపై విధి అగునో, యుక్త వయస్కుడైన అటువంటి ప్రతి ముస్లిం శుక్రవారము నాడు గుసుల్ చేయాలి, అది అతనిపై విధి – అని స్పష్టపరిచినారు. అలాగే ‘మిస్వాక్’ పుల్లను, లేదా అటువంటి ఇంకా ఏదైనా పుల్లను (బ్రష్’ను) ఉపయోగించి పళ్ళు శుభ్రపరుచుకొనుట కూడా విధి. అలాగే అందుబాటులో ఉంటే ఏదైనా పరిమళ ద్రవ్యాన్ని (ఉదా: ఏదైనా అత్తరును) పూసుకొనుట కూడా విధి.

فوائد الحديث

శుక్రవారము నాడు, యుక్తవయస్కుడైన ప్రతి ముస్లిం పురుషుడు గుసుల్ చేయుట అభిలషణీయము అని నిర్దారించబడినది.

షరియత్’ను అనుసరించి ఒక ముస్లిం శుభ్రంగా ఉండాలి మరియు అసహ్యకరమైన వాసనలను తొలగించుకోవాలి.

ఈ హదీసు లో శుక్రవారము యొక్క ప్రత్యేకత, ఘనత మరియు దాని కొరకు ఉత్తమంగా తయారు అవడాన్ని గురించి తెలియజేయబడినది.

అలాగే శుక్రవారము నాడు ‘మిస్వాక్’ వినియోగించడం కూడా అభిలషణీయము.

శుక్రవారపు సలాహ్ కొరకు బయలుదేరి వెళ్ళుటకు ముందు ఏదైనా మంచి సుగంధాన్ని (అత్తరును) పూసుకొనుట కూడా అభిలషణీయము.

సలాహ్ ఆచరించుట కొరకు గానీ, లేక మరింకేదైనా అవసరం కొరకు స్త్రీ ఒకవేళ తన ఇంటినుండి బయలుదేరినట్లయితే ఆమె పరిమళద్రవ్యాన్ని (అత్తరును) వినియోగించరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులో ఆధారాలు దీని యొక్క నిషేధాన్నే సూచిస్తున్నాయి.

“ముహ్తలిమ్”: అంటే యవ్వనపు మరియు యుక్తవయస్సు సంకేతాలు కలిగిన వ్యక్తి. షరియత్ ప్రకారం ఆ సంకేతాలు నాలుగు. వాటిలో మూడు మగపిల్లలకు ఆడ పిల్లలకు సమానంగా వర్తిస్తాయి. మొదటి సంకేతం: పిల్లలు పదిహేను సంవత్సరాల వయస్సుకు చేరడం; రెండవ సంకేతం జననేంద్రియాల చుట్టూ (నాభి క్రింది భాగములో) వెంట్రుకలు మొలవడం; మూడవ సంకేతం నిద్రలో స్వప్నస్ఖలనము కావడం, లేదా నిద్రలో కాకపోయినా మెలుకువగా ఉన్న స్థితిలోనైనా కామము, వాంఛతో వీర్యమును బయటకు తీయడం. నాలుగవ సంకేతము – ఇది ఆడపిల్లలకు మాత్రమే ప్రత్యేకమైనది – ఇది ఋతుస్రావము (బహిష్ఠు); ఆడపిల్లలకు మొట్టమొదటి సారి బహిష్ఠు కలిగితే వారు యుక్తవయస్కులు అయినట్లే.

التصنيفات

జుమా నమాజ్ ఆదేశాలు