“ఏడు ఎముకలపై (ఏడు ఎముకలు భూమికి ఆనేలా) సజ్దాహ్ చేయమని నేను ఆదేశించబడ్డాను

“ఏడు ఎముకలపై (ఏడు ఎముకలు భూమికి ఆనేలా) సజ్దాహ్ చేయమని నేను ఆదేశించబడ్డాను

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఏడు ఎముకలపై (ఏడు ఎముకలు భూమికి ఆనేలా) సజ్దాహ్ చేయమని నేను ఆదేశించబడ్డాను. “నుదురు (అలా అని ఆయన చేతితో తన ముక్కు వైపునకు సంజ్ఞ చేసినారు), రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, మరియు రెండు కాళ్ళ చివరలు (అంటే రెండు కాలివేళ్ళు); మరియు బట్టలను గానీ జుట్టును గానీ పైకి దోపుకోరాదని కూడా ఆదేశించబడినది.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ ఆచరించునపుడు ఏడు శరీర భాగాలపై సజ్దాహ్ చేయమని అల్లాహ్ ఆదేశించినాడని వివరించారు. మొదటిది: నుదురు: ఇది ముఖములో భాగము; ఇది ముక్కు మరియు కనుల పైభాగము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతితో ముక్కును సూచించినారు; నుదురు మరియు ముక్కు రెండూ కలిపి ఏడు శరీర భాగాలలో ఒకటి అని సూచిస్తూ. దానిద్వారా సజ్దాహ్ చేయు వ్యక్తి ముక్కును కూడా నేలను ఆనించాలని ప్రత్యేకంగా సూచించినారు అన్నమాట. రెండవ మరియు మూడవ శరీర భాగములు – రెండు చేతులు. నాలుగవ మరియు ఐదవ శరీరభాగములు: రెండు మోకాళ్ళు. ఆరవ మరియు ఏడవ శరీర భాగములు: రెండు కాళ్ళ వేళ్ళు. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం – సజ్దాహ్ చేయునపుడు ధరించిన దుస్తులను గానీ, లేక తల వెంట్రుకలను గానీ పైకి దోపుకోరాదని ఆదేశించినారు. వాటిని నేలపై పరుచునేలా వదిలివేసి సజ్దాహ్ చేయాలని సూచించినారు.

فوائد الحديث

ఏడు శరీర భాగాలపై సజ్దాహ్ చేయుట విధి (వాజిబ్).

సజ్దాహ్ చేయునపుడు బట్టలను మరియు తల వెంట్రుకలను సరి చేసుకొనుట, లేక పైకి దోపుకొనుట, మొదలైనవి మక్రూహ్ చర్యలు (అయిష్టమైన చర్యలు).

సలాహ్ ఆచరిస్తున్న వ్యక్తి సజ్దాహ్ చేయునపుడు ప్రశాంతంగా ఏడు శరీర భాగాలు నేలకు ఆనించి సజ్దాహ్ చేయాలి. సజ్దాహ్ స్థితిలో పలుకవలసిన దుఆలు, స్తుతి వాక్యాలు పలుకుట పూర్తిగా అయిపోయేంత వరకు ఏడు శరీర భాగాలు నేలకు ఆని ఉండేలా చేయుట తప్పనిసరి.

సజ్దాహ్ చేయునపుడు తల వెంట్రుకలను పైకి దోపుకోరాదని, అలాగే వదిలివేయాలనే ఆదేశము కేవలం పురుషులకొరకు మాత్రమే, స్త్రీలకు కాదు. ఎందుకంటే సలాహ్ ఆచరించునపుడు స్త్రీలు తల నుండి మొదలుకుని పాదాల వరకు తమను తాము పూర్తిగా కప్పుకుని ఉండాలని ఆదేశించబడింది.

التصنيفات

నమాజ్ పద్దతి