“నిలబడి ఆచరించు, అలా చేయలేకపోతే కూర్చుని ఆచరించు, అలా కూడా చేయలేకపోతే ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించు”

“నిలబడి ఆచరించు, అలా చేయలేకపోతే కూర్చుని ఆచరించు, అలా కూడా చేయలేకపోతే ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించు”

ఇమ్రాన్ బిన్ హుస్సైన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను మొలల వ్యాధితో బాధపడుతున్నాను. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను నా నమాజు గురించి ప్రశ్నించాను. దానికి వారు ఇలా అన్నారు.” “నిలబడి ఆచరించు, అలా చేయలేకపోతే కూర్చుని ఆచరించు, అలా కూడా చేయలేకపోతే ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించు”.

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు: శక్తి, సమర్థత లేని పరిస్థిలో తప్ప, నమాజుకు సంబంధించి ప్రాథమిక నియమం ఏమిటంటే నిలబడి నమాజును ఆచరించడం. నిలబడే శక్తి, సమర్థత లేని పరిస్థితిలో అతడు కూర్చుని ఆచరించాలి, ఒకవేళ అతడు కూర్చుని కూడా ఆచరించలేకపోతే అపుడు ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించాలి.

فوائد الحديث

మతి స్థిమితము కలిగి ఉన్నంత వరకు (పిచ్చి వాడు కాకపోయినట్లయితే) నమాజు నుండి మినహాయింపు లేదు. కనుక ఒక స్థితి నుండి మరొక స్థితికి మారడం అనేది శక్తి, సమర్థత, సామర్థ్యము లపై ఆధారపడి ఉంటుంది.

ఇస్లాం యొక్క ఘనత ఏమిటంటే, ఇబాదాత్’లకు సంబంధించి (ఆరాధనలకు సంబంధించి) అందులో దాసుడు తన శక్తి సామర్థ్యాల మేరకు ఆచరించే సౌలభ్యం కలుగజేస్తుంది.

التصنيفات

వంక కలవారి నమాజ్