“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైనిక దాడిలో, చంపబడి ఉన్న ఒక స్త్రీ శవాన్ని ఆయన చూసినారు. అపుడు రసూలుల్లాహ్…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైనిక దాడిలో, చంపబడి ఉన్న ఒక స్త్రీ శవాన్ని ఆయన చూసినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలను, పిల్లలను చంపడాన్ని ఖండించారు, బహిరంగంగా నిందించినారు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సైనిక దాడిలో, చంపబడి ఉన్న ఒక స్త్రీ శవాన్ని ఆయన చూసినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలను, పిల్లలను చంపడాన్ని ఖండించారు, బహిరంగంగా నిందించినారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఒక సైనిక దండయాత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక స్త్రీ చంపబడి ఉండడాన్ని చూసినారు. అపుడు ఆయన (యుద్ధములో) స్త్రీలను మరియు యుక్త వయస్సుకు చేరని పిల్లను చంపడాన్ని ఖండించారు,

فوائد الحديث

యుద్ధంలో పాల్గొనని వారిని, అంటే ఉదాహరణకు: యుద్ధములో పాల్గొనని స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, సన్యాసులు, ధర్మగురువులు మరియు ఈ కోవకు చెందిన వారిని; ఒకవేళ వారు ముస్లిములకు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్త పరుస్తూ ఉండపోయినట్లయితే, లేక ముస్లిములకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వారికి సహాయసహకారాలు అదించకుండా ఉన్నట్లయితే; అటువంటి వారిని (యుద్ధం పేరిట) చంపరాదు. ఒకవేళ వారు అలా (ముస్లిములకు వ్యతిరేకంగా ఏమైనా) చేస్తూ ఉండినట్లయితే వారిని వధించవచ్చు.

స్త్రీలు మరియు పిల్లలను చంపడం నిషేధం, ఎందుకంటే ఈ వ్యక్తులు ముస్లింలతో పోరాడరు, మరియు సర్వోన్నతుడైన అల్లాహ్ మార్గంలో జిహాద్ యొక్క ఉద్దేశ్యం పోరాటకారుల శక్తిని విచ్ఛిన్నం చేయడం మాత్రమే, తద్వారా సత్యమార్గం వైపునకు పిలిచే పిలుపు ప్రజలందరికీ చేరుతుంది.

ఈ హదీసు ద్వారా – దండయాత్రలు మరియు యుద్ధ సమయాలలో సైతం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దయ, కరుణ మనకు తెలుస్తున్నాయి.

التصنيفات

ధర్మపోరాట పద్దతులు