“నేను ఎన్నడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తన కొండనాలుక కనిపించేటంతగా (నోరు తెరిచి) మనస్ఫూర్తిగా నవ్వడం…

“నేను ఎన్నడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తన కొండనాలుక కనిపించేటంతగా (నోరు తెరిచి) మనస్ఫూర్తిగా నవ్వడం చూడలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం చిరునవ్వు మాత్రమే నవ్వేవారు.”

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “నేను ఎన్నడూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తన కొండనాలుక కనిపించేటంతగా (నోరు తెరిచి) మనస్ఫూర్తిగా నవ్వడం చూడలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం చిరునవ్వు మాత్రమే నవ్వేవారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేస్తున్నారు – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ, తన ‘లహాత్’ – నోటిలో గొంతు పైభాగాన వ్రేళ్ళాడుతూ ఉన్నట్లు ఉండే మాంసపు తునక అంటే కొండనాలుక - కనిపించేటంత ఎక్కువగా నవ్వలేదు. ఆయన కేవలం చిరునవ్వు మాత్రం నవ్వేవారు.

فوائد الحديث

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషంగా ఉన్నప్పుడు, మరియు ఏదైనా విషయం కారణంగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషపడినపుడు తన ఆనందాన్ని లేదా ఉల్లాసాన్ని వ్యక్తీకరించేదుకు అతిగా నవ్వడం కంటే ఎక్కువగా చిరునవ్వు మాత్రమే నవ్వేవారు.

ఇమాం ఇబ్న్ హజర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వును పూర్తిగా ఆస్వాదిస్తూ, అందులో మునిగిపోయే విధంగా, హృదయపూర్వకంగా నవ్వడం నేను ఎన్నడూ చూడలేదు”.

అతిగా నవ్వడం, బిగ్గరగా, అట్టహాసంగా నవ్వడం ‘సాలిహీన్’ల (ధర్మనిష్టాపరుల) గుణలక్షణాలలో లేని విషయం.

అపరిమితమైన నవ్వు అతని సోదరులలో అతని గౌరవాన్ని, మరియు ప్రతిష్ఠను తగ్గిస్తుంది.

التصنيفات

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వు