“(ఒకసారి) నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నాను. (దారిలో) ఆయన ఒక తెగవారు తమ చెత్తాచెదారం వేసే స్థలం…

“(ఒకసారి) నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నాను. (దారిలో) ఆయన ఒక తెగవారు తమ చెత్తాచెదారం వేసే స్థలం వద్దకు వచ్చారు. అక్కడ ఆయన నిలబడి మూత్ర విసర్జన చేసారు,

హుజైఫహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “(ఒకసారి) నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నాను. (దారిలో) ఆయన ఒక తెగవారు తమ చెత్తాచెదారం వేసే స్థలం వద్దకు వచ్చారు. అక్కడ ఆయన నిలబడి మూత్ర విసర్జన చేసారు, నేను ఒక ప్రక్కకు వెళ్ళిపోయాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను దగ్గరికి రమ్మని పిలిచినారు. నేను ఆయన మడమల వెనుక భాగాన నిలబడేటంత దగ్గరగా వెళ్ళాను. తరువాత ఆయన వుజూ చేసి, తన కాళ్ళకు తొడిగుకుని ఉన్న మేజోళ్ళపై (సాక్సులపై) మసహ్ చేసినారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

హుజైఫహ్ ఇబ్నె అల్ యమాన్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖిస్తున్నారు – ఒకసారి తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నానని, వారు మూత్రవిసర్జన చేయాలని తలంచి, ఒక తెగ వారి పెరడు భూమిలోని ప్రవేశించినారు. అక్కడ ఆ తెగవారు తమ ఇళ్ళను ఊడ్చిన చెత్త, దుమ్ము ధూళి తదితర చెత్తా చెదారం పడవేస్తారు. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – సాధారణంగా ఎపుడూ కూర్చుని మూత్రవిసర్జన చేసే వారు అయినప్పటికీ – నిలబడి మూత్రవిసర్జన చేసినారని ఉల్లేఖించినారు. హుజైఫహ్ రజియల్లాహు అన్హు ఆయన నుండి దూరంగా జరిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో: “దగ్గరికి రా” అన్నారు. అపుడు హుజైఫహ్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మడమల వెనుక, ఆ స్థితిలో ఆయన కబడకుండా ఒక తెరలాగ నిలబడినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేసినారు. కాళ్ళు కడగవలసి వచ్చినపుడు ఆయన తన కాళ్ళకు తొడుగుకుని ఉన్న మేజోళ్ళపై (సాక్సులపై) మసహ్ చేసి సరిపెట్టినారు. అవి మడమలను కప్పి ఉంచేలా, పలుచని తోలు లేదా అటువంటి దానితో తయారు చేయబడి, కాళ్ళకు తొడుగుకునే మేజోళ్ళు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని తన కాళ్ళ నుండి తొలగించలేదు.

فوائد الحديث

కాళ్ళకు తొడుగుకుని ఉన్న సాక్సులపై (మేజోళ్ళపై) మసహ్ చేయుట షరియత్ లోని భాగమే.

నిలబడి మూత్రవిసర్జన చేయుట అనుమతించబడినదే, అయితే మూత్రపు చుక్కలు పైన పడకుండా జాగ్రత్త పడాలి.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూత్ర విసర్జన కొరకు (ఇసుకలో) చెత్తాచెదారం మరియు ఇళ్ళనుండి ఊడ్చిన దుమ్ముధూళి పడవేసే చోటును ఎంచుకున్నారు. ఎందుకంటే సాధారణంగా అటువంటి చోట మూత్రవిసర్జన చేయు వానిపైకి మూత్రము వెనుకకు చిందదు.

التصنيفات

రెండు మేజోళ్ళపై మరియు అటువంటి వాటి పై స్పర్శించుకోవటం.