‘అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి

‘అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు’లో ప్రారంభములో “అల్లాహు అక్బర్” అని పలికినపుడు ఖుర్’ఆన్ పఠనం ప్రారంభించుటకు ముందు కొద్ది సేపు మౌనంగా ఉంటారు. నేను వారితో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా తల్లిదండ్రులు మీ కొరకు త్యాగం అగుగాక, ‘తక్బీర్’కు మరియు ‘ఖుర్ఆన్ పఠనానికి’ మధ్య మీరు ఏమి పలుకుతున్నారు?” దానికి వారు “నేను ‘అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్యజు మినద్దనసి, అల్లాహుమ్మఘ్’సిల్నీ మిన్ ఖతాయాయ బిస్సల్జీ వల్ మాఇ వల్ బరది’ అని పలుకుతాను” అన్నారు (ఓ అల్లాహ్! నన్ను నా పాపాల నుండి దూరంగా ఉంచు, ఏవిధంగానైతే నీవు తూర్పును పడమర నుండి దూరంగా ఉంచినావో; ఓ అల్లాహ్! ఏవిధంగానైతే తెల్లని వస్త్రము మురికి మాలిన్యాలనుండి పరిశుభ్రం చేయబడుతుందో, ఆ విధంగా నన్ను నా పాపాలనుండి పరిశుధ్ధుడిని చేయి; ఓ అల్లాహ్! నా పాపాలను నానుంచి నీళ్ళు, మంచు మరియు వడగళ్ళతో కడిగివేయి).

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు కొరకు తక్బీర్ పలికిన తరువాత, సూరతుల్ ఫాతిహా పఠించుటకు ముందు కొద్ది సేపు మౌనంగా ఉండి, ఆ మధ్యలో కొన్ని దుఆలు చదివి నమాజు ప్రారంభించేవారు. వాటిలో ఆయన ఈ విధంగా పలికిన దుఆ కూడా ఒకటి. ‘అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్యజు మినద్దనసి, అల్లాహుమ్మఘ్’సిల్నీ మిన్ ఖతాయాయ బిల్’మాఇ వస్సల్జీ వల్ బరద్’ ఈ దుఆలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వ శక్తిమంతుడూ, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్’ను వేడుకుంటున్నారు – తనను తన పాపాల నుండి, వాటిలో మళ్ళీ ఎపుడు పడకుండా దూరం చేయమని, మరింకెప్పుడూ వాటితో తన కలయిక సాధ్యం కానంత దూరంగా; ఏ విధంగానైతే తూర్పు పడమరల మధ్య శాశ్వతంగా కలయిక ఉండదో ఆ విధంగా దూరం చేయమని; ఒకవేళ తాను అందులో పడిపోతే ఏవిధంగానైతే తెల్లని వస్త్రము మురికి మాలిన్యాలనుండి పరిశుభ్రం చేయబడుతుందో, ఆవిధంగా తనను పాపాలనుండి పరిశుధ్ధుడిని చేయమని; అలాగే ఆ పాపాల వేడి నుండి శీతలీకరణ మరియు శుధ్ధీకరణ కారకాలైన నీరు, మంచు మరియు వడగళ్ళతో తనను కడిగివేయమని.

فوائد الحديث

పైకి చదవబడే నమాజు (ఫజ్ర్, మఘ్రిబ్ మరియు ఇషా) అయినప్పటికీ ప్రారంభపు దుఆ మౌనంగానే చదువబడుతుంది.

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రతి స్థితిని గురించి – అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చలనంలో ఉన్నా, ఏమీ చేయకుండా ఊరికే ఉన్నా, మౌనంగా ఉన్నా వారి ప్రతి పరిస్థితిని గురించి – తెలుసుకోవాలనే సహాబాల యొక్క శ్రద్ధ, కుతూహలం మనకు కనిపిస్తున్నాయి.

హదీసు గ్రంథాలలో నమాజు కు సంబంధించి మరికొన్ని ప్రారంభపు దుఆలు నమోదు చేయబడి ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా నిరూపితమై ఉన్న అటువంటి దుఆలలో ఒక దుఆ ఒకసారి మరొక దుఆ మరొక సారి పఠించుట ఉత్తమం.

التصنيفات

నమాజ్ దఆలు