“విశ్వాసులలో స్త్రీలు, పురుషులు ఎవరైనా – స్వయంగా వారి విషయంలోనూ, వారి సంతానం విషయంలోనూ, వారి సంపదల విషయంలోనూ…

“విశ్వాసులలో స్త్రీలు, పురుషులు ఎవరైనా – స్వయంగా వారి విషయంలోనూ, వారి సంతానం విషయంలోనూ, వారి సంపదల విషయంలోనూ పరీక్షించబడుతూనే ఉంటారు - చివరికి వారు తమ ఖాతాలో ఒక్క పాపము కూడా లేకుండా అల్లాహ్’ను కలుసుకునే వరకు.”

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసులలో స్త్రీలు, పురుషులు ఎవరైనా – స్వయంగా వారి విషయంలోనూ, వారి సంతానం విషయంలోనూ, వారి సంపదల విషయంలోనూ పరీక్షించబడుతూనే ఉంటారు - చివరికి వారు తమ ఖాతాలో ఒక్క పాపము కూడా లేకుండా అల్లాహ్’ను కలుసుకునే వరకు.”

[ప్రామాణికమైనది]

الشرح

ఈ హదీసులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపరుస్తున్నారు : కష్టాలు వచ్చి మీద పడడం, వాటి ద్వారా అల్లాహ్ విశ్వాసులైన స్త్రీలను, పురుషులను పరీక్షించడం – ఈ రెండూ ఒకదాని నుండి మరొకటి విడదీయలేని విషయాలు. వాటి ద్వారా అల్లాహ్ స్వయంగా వారిని పరీక్షిస్తాడు – ఉదాహరణకు: స్త్రీలను, పురుషులను వారి ఆరోగ్యం విషయంలో, వారి శరీరం విషయంలో రుగ్మతలకు గురి చేసి; అలాగే సంతానం విషయంలో పరీక్షిస్తాడు, ఉదాహరణకు: సంతానాన్ని వ్యాధిగ్రస్తులను చేసి, వారిని మరణింపజేసి, లేదా వారిని తల్లిదండ్రుల పట్ల అవిధేయులుగా చేసి, లేదా ఇంకా వేరే విధానాలలో; అలాగే వారి సంపదల విషయంలోనూ పరీక్షిస్తాడు, ఉదాహరణకు: పేదరికానికి గురి చేసి, లేదా వ్యాపారంలో నష్టాలకు గురి చేసి, లేదా పేద జీవన పరిస్థితులలో మరియు జీవనోపాధిలో ఇబ్బందులకు గురి చేసి పరీక్షిస్తాడు; ఇలా అల్లాహ్ ఆ పరీక్షల ద్వారా వారి పాపాలు మరియు అతిక్రమణలు అన్నింటినీ పరిహరించే వరకు చేస్తాడు; ఆ విధంగా అతను అల్లాహ్‌ను కలిసినప్పుడు, అతను చేసిన పాపాలన్నింటి నుండీ మరియు అతిక్రమణలన్నింటి నుండీ శుద్ధి చేయబడిన స్థితిలో వారు అల్లాహ్ ను కలుసుకుంటారు.

فوائد الحديث

ఇది తన దాసుల పట్ల అల్లాహ్ యొక్క కరుణ – వారిని ఇహలోక జీవితంలోనే పరీక్షలకు గురి చేసి వారి పాపాలను, వారి అతిక్రమణలను ఇక్కడే పరిహరించుకు పోయేలా చేస్తాడు.

దాసునిపై వచ్చి పడే పరీక్షలు ఒక షరతుపై ఆధారపడి అతడి పాపాలను, అతిక్రమణలను పరిహరిస్తాయి – ఆ షరతు ఏమిటంటే అతడు విశ్వాసాన్ని కలిగి ఉండడం, దానిని కోల్పోకుండా ఉండడం, పరీక్షలు అతనిపై వచ్చిపడుతుండడంతో అతడు అసహనానికి, అసంతృప్తికి, కోపానికి గురికాకుండా – సహనం వహించడం.

ఈ హదీథులో అన్ని విషయాలలో సహనం వహించడం, ఓపికగా ఉండడం అవసరం అనే హితబోధ ఉన్నది – అది మనం ఇష్టపడే విషయమైనా, మనకు ఇష్టం లేని విషయమైనా సరే – అల్లాహ్ ఆదేశించిన దానిని ఆచరించుటలో సహనం వహించాలి, అలాగే అల్లాహ్ నిషేధించిన వాటి నుండి పూర్తిగా దూరంగా ఉండుటలో సహనం వహించాలి; అది కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ, మరియు ఆయన శిక్షకు భయపడుతూ జరగాలి.

ఈ హదీథులో “విశ్వాసులలో స్త్రీలు, పురుషులు..” అని పేర్కొనబడింది. ఇటువంటి సందర్భాలలో అభివ్యక్తి కొరకు వాడే పదాలు సాధారణంగా పుంలింగ పదాలే అయి ఉంటాయి. అయినప్పటికీ అందులో ఉన్న విషయము, లేదా ఆదేశము పురుషులకు మాత్రమే కాకుండా, స్త్రీలకు కూడా వర్తిస్తుంది. కానీ ఈ హదీథులో అలా కాకుండా “విశ్వాసులలో స్త్రీలు..” అని స్త్రీలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పేర్కొనడం జరిగింది. అలా పేర్కొనడం దేనికి సాక్ష్యమంటే, స్త్రీలపై కూడా ఏదైనా కష్టం, ఆపద వచ్చి పడితే ఆమెకు కూడా ఇదే విధమైన ప్రతిఫలం ఇవ్వబడుతుంది – ఆమె పాపాలు, ఆమె అతిక్రమణలు అన్నీ పరిహరించి పోయి ఆమె అల్లాహ్’ను కలుసుకుంటుంది.

అల్లాహ్ యొక్క దాసునిపై, ఒకదాని తరువాత ఒకటిగా వచ్చి పడే కష్టాలను, బాధలను, పరీక్షలను ఎదుర్కొనడాన్ని ఏ విషయం సులభతరం చేస్తుంది అంటే, అది తద్వారా లభించే పుణ్యఫలం యొక్క ఘనతయే.

التصنيفات

తీర్పు , విధి వ్రాత పై విశ్వాసం., మనస్సుల పరిశుద్ధత