إعدادات العرض
“మమ్మల్ని (స్త్రీలను) జనాజాను అనుసరించకుండా (జనాజా వెంట వెళ్ళడం) నిషేధించారు, కానీ, దానిని కఠినంగా మాపై…
“మమ్మల్ని (స్త్రీలను) జనాజాను అనుసరించకుండా (జనాజా వెంట వెళ్ళడం) నిషేధించారు, కానీ, దానిని కఠినంగా మాపై నిషేధించలేదు”
ఉమ్మె అతియ్యహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “మమ్మల్ని (స్త్రీలను) జనాజాను అనుసరించకుండా (జనాజా వెంట వెళ్ళడం) నిషేధించారు, కానీ, దానిని కఠినంగా మాపై నిషేధించలేదు”.
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Português Kurdî Tiếng Việt Magyar ქართული Kiswahili සිංහල Română অসমীয়া ไทย मराठी ភាសាខ្មែរ دری አማርኛ ગુજરાતી Македонски Nederlands ਪੰਜਾਬੀ മലയാളം ಕನ್ನಡالشرح
ఉమ్ అతియా అల్-అన్సారియహ్ రదియల్లాహు అన్హా ఉల్లేఖన ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం స్త్రీలు జనాజా తీసుకు వెళుతున్న జమఆతును అనుసరించడాన్ని నిషేధించారు; కారణం మృత్యువు కారణంగా తమ వారిలోని ఒకరు దూరమై పోవడం అనే విషయాన్ని తేలికగా జీర్ణించు కోలేని వారి సున్నితత్వం, వారి పరిమితమైన ఓర్పు మొదలైనవి. ఆమె ఇంకా ఇలా అన్నారు: అయితే ఇతర నిషేధిత విషయాలలో కఠినంగా నొక్కి చెప్పినట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయంలోని నిషేధాన్ని నొక్కి చెప్పలేదు.فوائد الحديث
మహిళలు జనాజాను అనుసరించడంపై నిషేధం అనేది సాధారణత్వం కలిగిన ఆదేశం, అంటే ఈ నిషేధము మృతదేహానికి గుసుల్ (ఇస్లామీయ పద్ధతిలో స్నానం) చేయించి ఖననం కొరకు సిద్ధం చేయబడే ప్రదేశం, అంత్యక్రియల నమాజు నిర్వహించబడే ప్రదేశం మరియు మృతదేహం ఖననం చేయబడే ఖబరస్తాను వరకు జనాజాను అనుసరించడం అన్నీ ఈ నిషేధములో ఉన్నాయి.
ఈ నిషేధానికి కారణం స్త్రీలు అలాంటి విచారకరమైన దృశ్యాలను మరియు భావోద్వేగ పరిస్థితులను భరించలేరు; వారు అటువంటి పరిస్థితులలో అవసరమైన సహనానికి విరుద్ధంగా అసంతృప్తి, అసహనం మరియు భావోద్వేగాలను ప్రదర్శించవచ్చు.
స్త్రీలు జనాజాను అనుసరించరాదు అనే నిషేధం వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం ఏమిటంటే – అది నిషేధము. అయితే ఉమ్మె అతియా రదియల్లాహు అన్హా, ఆ సందర్భాన్ని బట్టి, జనాజా అనుసరించకుండా విధించబడిన నిషేధం ఖచ్చితమైనది కాదని మరియు ధృవీకరించబడలేదని అర్థం చేసుకున్నారు. అయితే ఈ హదీథులో సూచించిన దాని కంటే, స్త్రీలు జనాజాను అనుసరించడంపై నిషేధానికి సంబంధించిన ఇతర హదీథులలో ఈ నిషేధము చాలా తీవ్రంగా సూచించబడినది.
