“ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనది! నిశ్చయంగా అతని అన్ని వ్యవహారాలు అతని కొరకు శుభాల్నే కలిగి ఉంటాయి.…

“ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనది! నిశ్చయంగా అతని అన్ని వ్యవహారాలు అతని కొరకు శుభాల్నే కలిగి ఉంటాయి. ఇలా ఒక విశ్వాసికి తప్ప మరింకెవరికీ ఉండదు

షుఐబ్ ఇబ్న్ సినాన్ అర్’రూమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనది! నిశ్చయంగా అతని అన్ని వ్యవహారాలు అతని కొరకు శుభాల్నే కలిగి ఉంటాయి. ఇలా ఒక విశ్వాసికి తప్ప మరింకెవరికీ ఉండదు. ఒకవేళ అతనికి మంచి కలిగితే, అతడు (అల్లాహ్’కు కృతజ్ఞతలు తెలుపుకుని) కృతజ్ఞుడై ఉంటాడు, అది అతనికి శుభప్రదమైనది; ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే, అతడు దానిపై సహనం వహిస్తాడు, అది కూడా అతనికి శుభప్రదమైనదే.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసి యొక్క స్థితి మరియు అతని వ్యవహారాల పట్ల ప్రశంసా పూర్వకమైన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు; ఎందుకంటే అతడి అన్ని పరిస్థితులూ అతని కొరకు శుభాన్ని కలిగి ఉంటాయి. ఈ పరిస్థితి కేవలం ఒక విశ్వాసికి తప్ప మరింకెవ్వరికీ ఉండదు. ఒకవేళ అతనికి ఏదైనా శుభం కలిగితే అతడు దానిపై అల్లాహ్’కు కృతఙ్ఞతలు అర్పిస్తాడు, ఇంకా మరింతగా కృతజ్ఞుడై ఉంటాడు. దానికి గాను అతడు (తీర్పు దినాన) ప్రతిఫలం కూడా పొందుతాడు. అలాగే ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే అతడు దానిపై సహనం వహిస్తాడు. అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తాడు, అందుకు అతనికి ప్రతిఫలం లభిస్తుంది. కనుక ప్రతి స్థితిలోనూ అతనికి ప్రతిఫలం బహూకరించబడుతుంది.

فوائد الحديث

ఈ హదీథులో శుభం కలిగినపుడు అల్లాహ్’కు కృతఙ్ఞతలు తెలుపుకోవడం, కష్టం కలిగినపుడు సహనం వహించడం – ఈ రెండు గుణాలు కలిగి ఉండుట యొక్క ఘనత తెలియు చున్నది. ఎవరైతే ఇలా చేస్తారో అతడు ఇహపరలోకాల శుభాలను పొందుతాడు. అలాగే ఎవరైతే అల్లాహ్ ప్రసాదించిన శుభాల పట్ల కృతజ్ఞుడై ఉండడో, మరియు కష్టం సంభవించినపుడు సహనం వహించడో అతడు ఇహపరలోకాల శుభాలను కోల్పోతాడు మరియు పాపాన్ని మూటగట్టుకుంటాడు.

ఇందులో విశ్వాసము కలిగి ఉండుట యొక్క ఘనత, మరియు ప్రతి స్థితిలోనూ కేవలం విశ్వాసం కలిగి ఉన్న వారు మాత్రమే (విశ్వాసులు మాత్రమే) శుభాలు పొందుతారు అని తెలియుచున్నది.

అల్లాహ్ యొక్క పూర్వనిర్దేశాన్ని (విధివ్రాతను) విశ్వసించే వ్యక్తి ప్రతి స్థితిలోనూ అతడు సంపూర్ణంగా సంతృప్తిని కలిగి ఉంటాడు. అదే అవిశ్వాసి తనపై కష్టాలు వచ్చి పడినపుడు అసంతృప్తిలో పడిపోతాడు, శుభాలు కలిగినపుడు, ఆ శుభాలు తీసుకువచ్చిన సిరిసంపదలలో పడిపోయి, వాటిని అల్లాహ్ యొక్క విధేయతకు అనుగుణమైన వాటిలో ఖర్చుచేయడం అటుంచి, అల్లాహ్ యొక్క విధేయతకు దూరమైపోతాడు.

అల్లాహ్ యొక్క పూర్వనిర్దేశాన్ని (విధివ్రాతను) విశ్వసించే వ్యక్తి ప్రతి స్థితిలోనూ అతడు సంపూర్ణంగా సంతృప్తిని కలిగి ఉంటాడు. అదే అవిశ్వాసి తనపై కష్టాలు వచ్చి పడినపుడు అసంతృప్తిలో పడిపోతాడు, శుభాలు కలిగినపుడు, ఆ శుభాలు తీసుకువచ్చిన సిరిసంపదలలో పడిపోయి, వాటిని అల్లాహ్ యొక్క విధేయతకు అనుగుణమైన వాటిలో ఖర్చుచేసే మాట అటుంచి, అల్లాహ్ యొక్క విధేయతకు దూరమైపోతాడు.

التصنيفات

మనస్సుల పరిశుద్ధత