إعدادات العرض
“ఈ ప్రపంచంలో నీవు ఒక అపరిచితునిలా లేదా ఒక బాటసారిలా ఉండు”
“ఈ ప్రపంచంలో నీవు ఒక అపరిచితునిలా లేదా ఒక బాటసారిలా ఉండు”
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా భుజాన్ని పట్టుకుని (ఒకసారి) నాతో ఇలా అన్నారు: “ఈ ప్రపంచంలో నీవు ఒక అపరిచితునిలా లేదా ఒక బాటసారిలా ఉండు”. ఇబ్న్ ఉమర్ ఇలా అంటూ ఉండేవారు: “సాయంత్రమైతే నీవు ఉదయం కొరకు వేచి చూడకు; మరియు ఉదయం అయితే సాయంత్రం కొరకు వేచి చూడకు. అనారోగ్య సమయంలో పనికి వచ్చేలా ఆరోగ్యం నుండి ఏదైనా గ్రహించు; మరణంలో పనికి వచ్చేలా (ఈ ప్రాపంచిక) జీవితం నుండి.”
الترجمة
العربية বাংলা Bosanski English Español Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी Hausa Kurdî Português සිංහල Nederlands অসমীয়া Tiếng Việt ગુજરાતી پښتو Oromoo አማርኛ ไทย Română മലയാളം Malagasy नेपाली Deutsch Кыргызча ქართული Moore Magyarالشرح
ఈ హదీథులో ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఇలా ప్రస్తావించారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన భుజం – అంటే భుజంతో చేయి కలిపే భాగాన్ని- పట్టుకుని తనతో ఇలా అన్నారు: “ఉండడానికి ఇల్లు గానీ, లేదా ఆశ్రయమిచ్చి, తమతో పాటు ఉంచుకోవడానికి, తనకంటూ ఎవ్వరూ లేని ఒక ప్రదేశానికి వచ్చిన అపరచితునిలా; సృష్టికర్త నుండి దూరం చేసే కారణాలలో ఒకటైన కుటుంబము, పిల్లలు మరియు బంధుత్వ సంబంధాలు లేని అపరిచితునిలా ఈ ప్రపంచంలో ఉండు. వాస్తవానికి పరాయి దేశానికి చేరుకున్న కొత్తవానిలా కాకుండా, తన మాతృభూమిని చేరుకోవాలని తపన పడే బాటసారిలా ఉండు. ఎందుకంటే పరాయి దేశానికి చేరుకున్న కొత్త వ్యక్తి అక్కడ స్థిరపడవచ్చు. కానీ తన మాతృదేశానికి మరలి పోవాలని ఆతృతపడే బాటసారి, ఆ పరాయి దేశాన్ని తేలికగా తీసుకుంటాడు, తను అక్కడే ఆగిపోకుండా తన తిరుగు ప్రయాణం పైననే పూర్తి ధ్యాస పెడతాడు. ఒక బాటసారి చివరికి తన మాతృదేశానికి చేరుకునే ప్రయాణంలో తనకు ఎంత అవసరమో అంత కంటే ఎక్కువ కావాలని కోరుకోడు. అలాగే ఒక విశ్వాసికి పరలోకంలో తన గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమయ్యే, సహాయపడే దాని కంటే ఈ ప్రపంచంలో ఎక్కువ ఏమీ అవసరం లేదు. ఇబ్న్ ఉమర్ ఈ ఉపదేశాన్ని అనుసరించేవారు. ఇంకా ఆయన ఇలా చెప్పేవారు: మీరు (ఉదయం) మేల్కొన్నట్లయితే, సాయంత్రం కోసం వేచి ఉండకండి, మరియు మీరు సాయంత్రం గడిపినట్లయితే, ఉదయం కోసం వేచి ఉండకండి మరియు సమాధులలోని వారి మధ్య మిమ్మల్ని మీరు సమాధిలో ఖననం చేయబడి ఉన్న వారిలా పరిగణించండి, ఎందుకంటే ఆరోగ్యం మరియు అనారోగ్యం లేకుండా జీవితం లేదు. కనుక ఆరోగ్యాన్ని అనుసరించి వచ్చే అనారోగ్యం వచ్చి పడి మిమ్మల్ని నిరోధించకముందే అల్లాహ్ యొక్క విధేయతలో సత్కార్యములు చేయుటకై త్వరపడండి; మరణానంతర జీవితంలో ప్రయోజనం కలిగించే ప్రతి దానిని చేస్తూ ఈ ప్రాపంచిక జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి.فوائد الحديث
ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థికి బోధించేటపుడు, సద్భావపూర్వకంగా, తన సహృదయతను వ్యక్త పరుస్తూ, అతని దృష్ఠిని బోధించబడుతున్న విషయం వైపునకు ఆకర్షించడానికి, అతని భుజంపై తన చేతిని వేయవచ్చు.
ఇతరులు అడగక పోయినా, సలహా రూపంలో మార్గదర్శకం చేస్తూ విషయబోధన ప్రారంభించాలి.
విశ్వసించదగిన చక్కని ఉదాహరణల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయాన్ని బోధించేవారు. "ఈ ప్రపంచంలో నీవు ఒక అపరిచితుడిలా ఉండు లేదా తన స్వదేశానికి మరలి పోయే ప్రయాణికుడిలాగా ఉండు" అని చెప్పారు.
పరలోకానికి చేరుకునే మార్గాన్ని అవలంబించే విషయంలో ప్రజలు భిన్నంగా ఉంటారు. ఇహలోక సుఖాలకు అతీతమైన స్థితిని సాధించే విషయంలో ఈ లోకం లో అపరిచితునిగా ఉండే వాని స్థితి కంటే, ఒక ప్రయాణికునిలా ఉండే వాని స్థితి ఉన్నతమైనదని దృష్టిలో ఉంచుకోవాలి.
ఈ ప్రపంచంలో సాధారణ ఆశయాలను కలిగి ఉండాలి మరియు అన్ని వేళలా మరణానికి సిద్ధంగా ఉండాలి.
ఈ హదీథు జీవనోపాధి కొరకు శ్రమించడాన్ని విడిచి పెట్టడం, లేదా ఈ ప్రాపంచిక ఆనందాలను నిషేధించడం గురించి సూచించదు; కానీ ఇహలోక సుఖాలకు అతీతమైన స్థితిని కలిగి ఉండాలని, వాటి వినియోగాన్ని సాధ్యమైనంత తక్కువగా చేయాలని ప్రోత్సహిస్తున్నది.
వ్యక్తి తాను అశక్తతకు లోనై, శక్తీ సామర్థ్యాలు నశించక ముందే, అనారోగ్యము లేదా మరణం సంభవించకముందే మంచి పనులు చేయుటలో తొందరపడాలి.
ఈ హదీథులో అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హు) యొక్క ఘనత తెలుస్తున్నది – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధన ఆయనను ప్రభావితం చేయడం గమనించవచ్చు.
విశ్వాసుల మాతృభూమి ‘అల్-జన్నహ్’ (స్వర్గము). కనుక ఈ లోకానికి సంబంధించి అతడు అపరిచితుడు, మరియు పరలోకానికి సంబంధించి అతడు ప్రయాణీకుడు. కనుక అతడు ఉంటున్న ప్రవాస దేశంలో అతని హృదయం దేనికీ అనుసంధానమై ఉండదు, తాను తిరిగి చేరుకోబోయే తన మాతృభూమికి అనుసంధానమై ఉంటుంది. ఈ ప్రపంచంలో అతని నివాసం కేవలం తన తిరుగు ప్రయాణానికి అవసరమైన మేరకు మాత్రమే తన అవసరాలను తీర్చుకుంటూ, తన తిరుగు ప్రయాణానికి తయారు కావాలి.
التصنيفات
మనస్సుల పరిశుద్ధత