“ఆహారం భుజించిన తరువాత ఎవరైతే “అల్ హందులిల్లాహిల్లదీ అత్’అమనీ హాదా వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్మిన్నీ వలా…

“ఆహారం భుజించిన తరువాత ఎవరైతే “అల్ హందులిల్లాహిల్లదీ అత్’అమనీ హాదా వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్మిన్నీ వలా ఖువ్వహ్” (ప్రశంసలన్నీ ఆ అల్లాహ్ కొరకే శోభిస్తాయి, ఎవరైతే నాలో ఎటువంటి శక్తి, బలమూ లేకపోయినా నాకు ఈ ఆహారాన్ని సమకూర్చినాడో) – అని పలుకుతాడో, అతని పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.”

సహల్ బిన్ ము’ఆజ్ ఇబ్న్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఆహారం భుజించిన తరువాత ఎవరైతే “అల్ హందులిల్లాహిల్లదీ అత్’అమనీ హాదా వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్మిన్నీ వలా ఖువ్వహ్” (ప్రశంసలన్నీ ఆ అల్లాహ్ కొరకే శోభిస్తాయి, ఎవరైతే నాలో ఎటువంటి శక్తి, బలమూ లేకపోయినా నాకు ఈ ఆహారాన్ని సమకూర్చినాడో) – అని పలుకుతాడో, అతని పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.”

[ప్రామాణికమైనది] [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد]

الشرح

ఆహారం భుజించిన తరువాత ప్రతి ఒక్కరూ అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడాలని (ఆయన ఘనత ముందు మన అశక్తతను గుర్తించాలని) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) హితబోధ చేస్తున్నారు. ‘అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, ఆయన సహాయంతో తప్ప, ఆహారం తెచ్చుకొనుటకు గానీ, దానిని భుజించుటకు గానీ శక్తిలేని వాడను’ అని. ఆహారం భుజించిన తరువాత ఎవరైతే ఆ విధంగా అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడుతారో, అతని పూర్వపు చిన్న చిన్న పాపాలన్నీ క్షమించబడుటకు అర్హుడవుతాడు అనే శుభవార్తను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందజేస్తున్నారు.

فوائد الحديث

ఆహారం భుజించునపుడు చివరన అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడుట అభిలషణీయం.

ఈ హదీథు ఒక విధంగా అల్లాహ్ తన దాసులపై చూపిన అనుగ్రహం యొక్క ప్రకటన. వారి కొరకు ఆయన ఉపాధి మార్గాలను పొందుపరిచినాడు, వాటిని సులభతరం చేసినాడు; మరియు దానిని పాపాలకు ప్రాయశ్చిత్తంగా చేసినాడు.

దాసుల వ్యవహారాలు అన్నీ సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ నుండే; వారి స్వంత శక్తి మరియు బలం కారణంగా అవి జరుగవు. అందుకనే దాసుడు వనరులు, ఉపకరణాలు మరియు మూలాధారాలపై పని చేయమని ఆఙ్ఞాపించబడినాడు (ఫలితం కేవలం అల్లాహ్ నుండి మాత్రమే).

التصنيفات

సాధారణ విషయాల దుఆలు