إعدادات العرض
“అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరతి
“అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరతి
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఉదయమూ ప్రతి సాయంత్రమూ ఈ దుఆ పఠించకుండా ఎప్పుడూ వదిలి వేయలేదు: “అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరతి, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్’వ వల్ ఆఫియత ఫీ దీనీ, వ దున్యాయ, వ అహ్’లీ, వ మాలీ, అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ, అవ్: వ ఆమిన్ రౌఆతీ, అల్లాహుమ్మహ్’ఫజ్’నీ మింబైని యదయ్య, వమిన్ ఖల్ఫీ, వ అన్’యమీనీ, వ అన్’షిమాలీ, వమిన్ ఫౌఖీ; వ అఊదు బిఅజ్’మతిక అన్ ఉగ్’తాల మిన్ తహ్’తీ” (ఓ అల్లాహ్, నేను నిన్ను ఇహలోకంలో మరియు పరలోకంలో మంచిని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించమని కోరుతున్నాను; ఓ అల్లాహ్, నేను నిన్ను క్షమించమని మరియు నా ధర్మములో, నా ప్రాపంచిక జీవితంలో, నా కుటుంబంలో మరియు నా సంపదలో శ్రేయస్సు ప్రసాదించమని అడుగుతున్నాను. ఓ అల్లాహ్! నా తప్పులను కప్పివేసి, నా భయాన్ని తగ్గించు; ఓ అల్లాహ్! నా ముందు నుండి, నా వెనుక నుండి, నా కుడి నుండి మరియు నా ఎడమ నుండి మరియు నా పై నుండి నన్ను రక్షించు. మరియు నా క్రింద నుండి హఠాత్తుగా చంపబడకుండా నేను నీ ఘనతను, గొప్పతనాన్ని ఆశ్రయిస్తున్నాను.)
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Bahasa Indonesia Tagalog Türkçe اردو 中文 हिन्दी Français සිංහල ئۇيغۇرچە Hausa Kurdî Português Русский Nederlands অসমীয়া Tiếng Việt Kiswahili ગુજરાતી پښتو አማርኛ ไทย Oromoo Română മലയാളം Deutsch नेपाली Кыргызча ქართული Moore Magyarالشرح
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదయం మరియు సాయంకాలములలో ఎప్పుడూ ఈ దుఆ చేయకుండా ఉండలేదు. (అల్లాహుమ్మ అస్అలుకల్ ఆఫియత) ఓ అల్లాహ్! నాపై త్వరలో వచ్చి పడబోయే, లేక ఆలస్యంగా వచ్చి పడబోయే వ్యాధులు, దురదృష్టాలు, ప్రాపంచిక ప్రతికూలతలు, కోరికలు మరియు ధర్మపరమైన పరీక్షల నుండి రక్షణ ప్రసాదించి ఇహలోకం లోనూ మరియు పరలోకం లోనూ మంచిని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించమని నేను నిన్ను కోరుతున్నాను. (అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ అఫ్’వ, వల్ఆఫియత ఫీ దీనీ, వ దున్యాయ, వ అహ్’లీ, వ మాలీ) ఓ అల్లాహ్! నేను నీ క్షమాపణను వేడుకుంటున్నాను, నా పాపాలను తుడిచి వేయమని, మరియు వాటిని ఉపేక్షించమని వేడుకుంటున్నాను, నా తప్పులనుండి నాకు రక్షణ కల్పించి, నా ధర్మములో బహుదైవారాధన నుండి, ధర్మములో కొత్త విషయాలను జొప్పించుట నుండి, నా ప్రాపంచిక జీవితములో కష్ఠాలు, హాని, విపత్తులు మరియు చెడుల నుండి నాకు రక్షణను ఇవ్వమని వేడుకుంటున్నాను; మరియు నా కుటుంబములో, నా భార్యలు, నా సంతానము, నా బంధువులు, నా సంపద, నా ధనము నా ఉద్యోగము అన్నింటిలో శ్రేయస్సు కలిగించమని వేడుకుంటున్నాను. (అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ) ఓ అల్లాహ్, నా లోపాలను, నా దోషాలను, కొరతలను కప్పివేయి, నా పాపాలను తుడిచివేయి, భయం మరియు ఆందోళణలనుండి నన్ను సురక్షితంగా ఉంచు. (అల్లాహుమ్మఫజ్’నీ మిమ్’బైని యదయ్య, వమిన్ ఖల్ఫీ, వఅన్ యమీనీ, వఅన్ షిమాలీ, వ మిన్ ఫౌఖీ) ఓ అల్లాహ్, బాధల నుండి మరియు హానికరమైన వాటి నుండి, నా ముందు నుండి, నా వెనుక నుండి, నా కుడి నుండి, నా ఎడమ నుండి మరియు నా పై నుండి నన్ను రక్షించు. అన్ని దిశల నుండి రక్షించమని అల్లాహ్ కోరడం ఎందుకంటే, ప్రతికూలతలు, దురదృష్టాలు ఈ దిశలలో ఒకదాని నుండి మాత్రమే మనిషిని ప్రభావితం చేయగలవు, మరియు చేరుకోగలవు కనుక. (వ అఊజు బి అజ్మతిక, అన్ ఉగ్'తాల) మరియు ఓ అల్లాహ్! నేను అకస్మాత్తుగా చంపబడకుండా, మరియు నా క్రిందనుండి అకస్మాత్తుగా భూమి నన్ను మ్రింగి వేయకుండా నీ ఘనతను, మరియు నీ గొప్పతనాన్ని ఆశయిస్తున్నాను.فوائد الحديث
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉదాహరణను అనుసరిస్తూ ఈ పదాలను క్రమం తప్పకుండా పఠించాలి.
ధర్మములో క్షేమము, మంచి మరియు శ్రేయస్సుల కొరకు అల్లాహ్’ను వేడుకొనమని ఆదేశించినట్లే, ఈ ప్రాపంచిక జీవితములో శ్రేయస్సు కొరకు కూడా అల్లాహ్ ను వేడుకొనవలెనని ఆదేశించబడింది.
ఇమాం అత్తయ్యిబి ఇలా అన్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆలో ఆరు దిశలను పేర్కొన్నారు, ఎందుకంటే విపత్తులు, దురదృష్టాలు అక్కడి నుండి వస్తాయి; మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం క్రింది దిశను నొక్కి చెప్పినారు, ఎందుకంటే క్రింది నుండి (భూమి నుండి) వచ్చే విపత్తు భయంకరంగానూ, దారుణంగానూ ఉంటుంది కనుక.
అల్లాహ్ యొక్క స్మరణలలో ఉత్తమమైనది, దీనిని ఉదయం – అంటే ఉషోదయం నుండి సూర్యుడు ఉదయించే సమయానికి మధ్యన ఉచ్ఛరించుట ఉత్తమం, అలాగే సాయంకాలము – అంటే అస్ర్ తరువాత నుండి సూర్యుడు అస్తమించే సమయానికి మధ్యన ఉచ్ఛరించుట ఉత్తమం. ఒకవేళ పైన పేర్కొనబడిన సమయాలు దాటిన తరువాత ఉంచ్ఛరించినట్లయితే – అంటే, ఒకవేళ సూర్యుడు ఉదయించిన తరువాత ఉచ్ఛరించినట్లయితే (అది కూడా అనుమతించదగినదే) అది అతనికి సరిపోతుంది; ఒకవేళ జుహ్ర్ తరువాత ఉచ్ఛరించినట్లయితే (అది కూడా అనుమతించదగినదే) అది అతనికి సరిపోతుంది; ఒకవేళ మగ్రిబ్ (సూర్యుడు అస్తమించిన) తరువాత ఉచ్ఛరించినా (అది కూడా అనుమతించదగినదే) అది అతనికి సరిపోతుంది. అది అల్లాహ్ స్మరణ యొక్క సమయం.
షరియత్’లో ఆధారాల ద్వారా రాత్రి పూట పఠించవలెను అని నిరూపితమై ఉన్న స్మరణలను, సూర్యాస్తమయం అయిన తరువాత పఠించవచ్చును, ఉదాహరణకు: సూరతుల్ బఖరహ్ యొక్క ఆఖరి రెండు ఆయతులు.
التصنيفات
మాసూర్ దుఆలు