“(వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు) విధించుకునే షరతులలో, (మీ) సంభోగమును ఆమోదయోగ్యం (హలాల్) చేయు షరతులు…

“(వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు) విధించుకునే షరతులలో, (మీ) సంభోగమును ఆమోదయోగ్యం (హలాల్) చేయు షరతులు నెరవేర్చుటకు అర్హమైనవి

ఉఖబా ఇబ్న్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు) విధించుకునే షరతులలో, (మీ) సంభోగమును ఆమోదయోగ్యం (హలాల్) చేయు షరతులు నెరవేర్చుటకు అర్హమైనవి.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: (వివాహములో) దాంపత్య జీవితం అనుభవించుటను ధర్మ సమ్మతం చేసే షరతును అన్నింటి కంటే ముందుగా నెరవేర్చవలెను. వివాహ సమయాన ‘అఖ్దున్నికాహ్’ (వివాహ కాంట్రాక్ట్) లో ఈ విధముగా కాబోయే జీవిత భాగస్వాములు షరతులను విధించుట ధర్మసమ్మతమే.

فوائد الحديث

‘హలాల్’ (ధర్మసమ్మతమైన) విషయాన్ని ‘హరాం’ (నిషేధము) చేసే లేదా ‘హరాం’ విషయాన్ని ‘హలాల్’ గా చేసే ఏదైనా షరతు ఉంటే తప్ప, ‘వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు విధించుకున్న షరతులను వారు తప్పనిసరిగా (వాజిబ్ గా) పాటించాలి, నెరవేర్చాలి, పూర్తిచేయాలి.

వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు విధించుకున్న షరతులను నెరవేర్చుట, మిగతా షరతులను నెరవేర్చుట కంటే అత్యంత ఎక్కువ ప్రాధాన్యత కలిగిన విషయము. ఎందుకంటే అవి వారి దాంపత్య జీవితాన్ని ధర్మసమ్మతం చేస్తాయి గనుక.

వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు విధించుకునే షరతులు పాటించుటను, నెరవేర్చుటను తప్పనిసరి (వాజిబ్) చేయుట, ఇస్లాంలో వివాహము యొక్క ప్రతిష్ఠ, స్థాయి ఎంత ఘనమైనదో తెలియజేస్తున్నది.

التصنيفات

నికాహ్ లోని షరతులు