“ఎవరైతే (సాయంత్రం పూట) మూడుసార్లు “బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఉన్, ఫిల్ అర్ది, వలా ఫిస్సమాఇ,…

“ఎవరైతే (సాయంత్రం పూట) మూడుసార్లు “బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఉన్, ఫిల్ అర్ది, వలా ఫిస్సమాఇ, వహువస్సమీఉల్ అలీం” (అల్లాహ్ పేరుతో; ఎవరి పేరు ప్రస్తావించబడినపుడైతే, భూమిలోనూ, మరియు ఆకాశాలలోనూ ఉన్న దేదీ హాని కలిగించలేదో; ఆయన అన్నీ వినేవాడు, సర్వఙ్ఞుడు) అని పలుకుతాడో, అతడు ఉదయం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు

అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “నేను (నా తండ్రి) ఉథ్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఇలా పలుకగా విన్నాను: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా విన్నాను: “ఎవరైతే (సాయంత్రం పూట) మూడుసార్లు “బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఉన్, ఫిల్ అర్ది, వలా ఫిస్సమాఇ, వహువస్సమీఉల్ అలీం” (అల్లాహ్ పేరుతో; ఎవరి పేరు ప్రస్తావించబడినపుడైతే, భూమిలోనూ, మరియు ఆకాశాలలోనూ ఉన్న దేదీ హాని కలిగించలేదో; ఆయన అన్నీ వినేవాడు, సర్వఙ్ఞుడు) అని పలుకుతాడో, అతడు ఉదయం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు. మరియు ఎవరైతే ఈ పదాలను ఉదయం పలుకుతాడో, అతడు సాయంత్రం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు.” (ఇది విని అక్కడే ఉన్న వ్యక్తి, పక్షవాతానికి గురి అయి ఉన్న అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (ర) ను చూడసాగినాడు, దానితో ఆయన అతనితో) “ఎందుకలా చూస్తున్నావు నా వైపు? అల్లాహ్ సాక్షిగా, నేను ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) పట్ల అబద్ధం చెప్పలేదు, అలాగే ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అబద్ధం చెప్పలేదు. ఏ రోజైతే నాకు ఈ పక్షవాతం వచ్చిందో, ఆ రోజు నేను కోపంలో ఉండి ఈ మాటలు పలుకడం మర్చిపోయాను” అన్నారు.

[దృఢమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించినారు: ప్రతి రోజు ఉదయం, తెల్లవారుజామున, మరియు ప్రతి సాయంత్రం, సూర్యాస్తమయానికి ముందు మూడు సార్లు: (బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఇన్ ఫిల్ అర్ది వలా ఫిస్సమాఇ, వహుస్సమీఉల్ అలీం) అని పలుకుతాడో - అంటే (బిస్మిల్లాహి – అల్లాహ్ పేరుతో) నేను రక్షణ కోరుతున్నాను, (మఅస్మిహి) ఆయన పేరు పలికినంతనే (ఫిల్ అర్ది) భూమిపై ఉన్నది ఏదైనా, ఎంత పెద్దదైనా, లేక భూమి నుండి పుట్టుకు వచ్చే ఏ కీడు అయినా సరే, అలాగే (వలా ఫిస్సమాఇ) అలాగే ఆకాశాలలోని కీడులలో నుండి ఏ కీడు అవతరించినా (లాయదుర్రు) హాని కలిగించలేదు, (వహువస్సమీఉల్ అలీం) ఆయనే మనం మొరపెట్టుకునేదంతా వినేవాడు, మరియు మన పరిస్థితుల, స్థితిగతుల సంపూర్ణ ఙ్ఞానము కలవాడు – అని పలుకుతాడో; అతనికి అకస్మాత్తుగా కలిగే ఏ కీడూ హాని కలిగించదు. ఎవరైతే తాను నిద్రించడానికి పక్క పైకి చేరే ముందు ఈ వాక్యాలు ఉచ్ఛరిస్తాడో ఉదయం వరకు అతనిపై అకస్మాత్తుగా ఏ కీడూ, ఏ హానీ వచ్చి పడదు. అలాగే ఎవరైతే ఉదయం నిద్ర లేచినపుడు ఈ వాక్యాలను ఉచ్ఛరిస్తాడో సాయంత్రం వరకు అతనిపై అకస్మాత్తుగా ఏ కీడూ, ఏ హానీ వచ్చి పడదు. ఈ హదీథు ఉల్లేఖించిన అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (ర) పక్షవాతముతో బాధపడుతూ ఉండినారు. ఆయన శరీరంలో ఒక పార్శ్వము సాగిల పడినట్లుగా ఉండేది. ఆయన ఈ హదీథు ఉల్లేఖించినపుడు అక్కడే ఉన్న వ్యక్తి అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ వైపునకు ఆశ్చర్యంగా చూడసాగినాడు. దాంతో ఆయన ఆ వ్యక్తితో “ఎందుకలా నావైపు చూస్తున్నావు? అల్లాహ్ సాక్షిగా నేను ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ పట్ల అబద్ధం చెప్పలేదు; ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అబద్ధం చెప్పలేదు. నాకు ఈ పక్షవాతం సంభవించిన దినమున నేను ఈ వాక్యములు పలకాలని అల్లాహ్ రాసిపెట్టలేదు. ఆ దినము నేను కోపంలో ఉండి ఈ వాక్యములు పలకడం మరిచిపోయాను” అన్నారు.

فوائد الحديث

అల్లాహ్ ఆదేశముతో అకస్మాత్తుగా వచ్చి పడే ఏదైనా కీడు, ఆపద లేక హాని మొదలైన వాటి నుండి రక్షించబడుటకు గాను, ఈ జిక్ర్’ను (స్మరణను) ఉదయమూ, సాయంత్రమూ చేయుట మంచిది.

ఈ హదీథు ద్వారా, అల్లాహ్ యందు మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాటల యందు, పూర్వకాలపు సలఫ్’ సాలిహీనుల దృఢమైన మరియు అచంచలమైన విశ్వాసాన్ని మనం చూడవచ్చు.

ఉదయం మరియు సాయంత్రం దిక్ర్ చేయాలని సూచించడం వల్ల కలిగే ప్రయోజనాల్లో ఒకటి, ఒక ముస్లిం అజాగ్రత్త వహించ కుండా నిరోధించడం మరియు అతను సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క దాసుడు అనే వాస్తవాన్ని నిరంతరం గుర్తుచేసుకోవడంలో అతనికి సహాయం చేయడం.

దిక్ర్ యొక్క ప్రభావం మరియు దిక్ర్ యొక్క నెరవేర్పు - అల్లాహ్‌ ను స్మరించుకునే వ్యక్తి యొక్క విశ్వాస స్థాయి, అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల, వారి ఆదేశాల పట్ల అతని విధేయత, అతని చిత్తశుద్ధి మరియు ధృవీకరణతో పాటు దిక్ర్ చేయునపుడు అతని హృదయం దానిపై లగ్నమై ఉండుటపై ఆధారపడి ఉంటుంది.

التصنيفات

ఉదయం,సాయంత్రం దుఆలు