“మీలో ఎవరైనా నాపై ‘సలాం’ పంపినట్లయితే, అతనిపై తిరిగి ‘సలాం’ పంపుటకుగానూ అల్లాహ్ నా ఆత్మను తిరిగి పంపుతాడు.”

“మీలో ఎవరైనా నాపై ‘సలాం’ పంపినట్లయితే, అతనిపై తిరిగి ‘సలాం’ పంపుటకుగానూ అల్లాహ్ నా ఆత్మను తిరిగి పంపుతాడు.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా నాపై ‘సలాం’ పంపినట్లయితే, అతనిపై తిరిగి ‘సలాం’ పంపుటకుగానూ అల్లాహ్ నా ఆత్మను తిరిగి పంపుతాడు.”

[దాని ఆధారాలు ప్రామాణికమైనవి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: తనపై ఎవరు సలాం పంపినా – వారు దగ్గరగా ఉన్నా, లేక దూరంగా ఉన్నా- వారికి తిరిగి సలాం పంపుటకుగానూ, తన ఆత్మ తిరిగి పంపబడుతుంది. “బర్జఖ్” (అంటే మరణం మరియు పునరుథ్థాన దినము మధ్య కాలం); మరియు సమాధిలో జీవితం అనేది అగోచర విషయం (కనిపించనది). వాటి వాస్తవికత సర్వోన్నతుడు, అన్నింటిపై అధికారం కలవాడు అయిన అల్లాహ్’కు తప్ప మరెవరికీ తెలియదు.

فوائد الحديث

ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై సలాం మరియు శుభాలు అత్యంత అధికంగా పంపాలనే హితబోధ, ప్రోత్సాహము ఉన్నాయి.

బర్జఖ్’లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం – ఒక వ్యక్తి బర్జఖ్’లో జీవించగలిగే అత్యున్నతమైన జీవితం వలే ఉంటుంది. అయితే దాని వాస్తవికత సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ తెలియదు.

ఎవరైతే బర్జఖ్’లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం, మన ఈ ప్రాపంచిక జీవితం లాగానే ఉంటుంది అంటారో, అటువంటి వారి కొరకు ఈ హదీథులో తమ దావాను ఋజువు చేసే అంశం ఏదీ లేదు; అటువంటి ముష్రికీన్’లు (బహుదైవారాధకులు) ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుండి సహాయం కోరేందుకు ఈ హదీథును ఒక ఋజువుగా ఉపయోగించుకుంటారు. అది బర్జఖ్ జీవితం, ప్రాపంచిక జీవితం కాదు.

التصنيفات

దైవ ప్రవక్త ప్రత్యేకతలు