:

ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మరణ సమయం ఇంకా సమీపించని రోగిని సందర్శించి, అతని సమక్షంలో ఎవరైనా ఏడుసార్లు ఇలా అంటే అల్లాహ్ అతనిని ఆ వ్యాధి నుండి నయం చేస్తాడు: 'అస్’అలల్లాహుల్-‘అజీమ్ రబ్బుల్-‘అర్షిల్-‘అజిమ్ అన్ యష్ఫియక్ (నిన్ను నయం చేయమని నేను గొప్ప సింహాసనానికి అధిపతి అయిన అల్లాహ్‌ను అర్థిస్తున్నాను)'

[దృఢమైనది]

الشرح

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలిపినారు: 'ఇంకా తన మరణ సమయం సమీపించని, అనారోగ్యంతో పడి వున్న ముస్లింను ఎవరైనా ఒక ముస్లిం సందర్శించి, ఈ దుఆను ఆ అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కోసం ఏడుసార్లు రిపీట్ చేస్తే, అల్లాహ్ ఆ వ్యక్తిని ఆ అనారోగ్యం నుండి తప్పక స్వస్థపరుస్తాడు."' దుఆ: "నిన్ను స్వస్థపరచాలని నేను అల్లాహుల్ అజీమ్‌ను వేడుకుంటున్నాను - ఆయన స్వరూపంలో, షిఫాతులలో, కార్యాలలో గొప్పవాడు, గొప్ప సింహాసనానికి ప్రభువు."

فوائد الحديث

అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కోసం ఈ దుఆను ఏడుసార్లు పునరావృతం చేయడం సున్నత్ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచారం).

ఈ దుఆ ఎవరి కోసం చేస్తారో, మహోన్నతుడైన అల్లాహ్ తన అనుమతితో ఆ వ్యక్తికి ఔషధం ప్రసాదిస్తాడు - కానీ ఈ క్రింది షరతులతో: దుఆ ఇఖ్లాస్‌తో (నిష్కపట హృదయంతో) చేయబడాలి, దుఆ చేసేవారు సాలిహ్ (సత్పురుషులైన) జీవితం గడపాలి అయి ఉండాలి, రోగి యొక్క మరణ సమయం సమీపించకుండా ఉండాలి.

ఈ దుఆను నిశ్శబ్దంగా లేదా బిగ్గరగా చేయవచ్చు - రెండూ అనుమతించబడినవి. కానీ రోగి వినగలిగితే, బిగ్గరగా చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడాలి మరియు అలా చేయడం ఉత్తమం, ఎందుకంటే ఇది రోగి హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుంది.

التصنيفات

షరఈ రుఖయ్య