“ఎవరైతే “అల్’లాత్” మరియు “అల్’ఉజ్జా” ల సాక్షిగా అంటూ ప్రమాణం చేస్తాడో, అతడు మరలా ”లా ఇలాహ ఇల్లల్లాహ్” అని…

“ఎవరైతే “అల్’లాత్” మరియు “అల్’ఉజ్జా” ల సాక్షిగా అంటూ ప్రమాణం చేస్తాడో, అతడు మరలా ”లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలకాలి. ఎవరైతే తన సహచరునితో “రా, నీతో జూదమాడనివ్వు” అని ఆహ్వానిస్తాడో, అతడు దానధర్మాలు చేయాలి.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే “అల్’లాత్” మరియు “అల్’ఉజ్జా” ల సాక్షిగా అంటూ ప్రమాణం చేస్తాడో, అతడు మరలా ”లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలకాలి. ఎవరైతే తన సహచరునితో “రా, నీతో జూదమాడనివ్వు” అని ఆహ్వానిస్తాడో, అతడు దానధర్మాలు చేయాలి.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పేరునగాక వేరొకరి పేరుతో ప్రమాణం చేయరాదని హెచ్చరిస్తున్నారు, ఎందుకంటే ఒక విశ్వాసి కేవలం అల్లాహ్ పేరుతో మాత్రమే ప్రమాణం చేస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా తెలియజేస్తున్నారు: అల్’లాత్ మరియు అల్ ఉజ్జా అనేవి రెండు విగ్రహాలు, ఇస్లాంకు పూర్వం ప్రజలు వీటికి పూజలు చేసేవారు, వీటిని ఆరాధించేవారు. ఎవరైతే ఈ రెండు విగ్రహాల పేరున ప్రమాణం చేస్తాడో, అతడు – బహుదైవారాధనలో పడిపోకుండా, దాని నుండి దూరంగా ఉండేందుకు గానూ మరియు అల్’లాత్, అల్ ఉజ్జాల పేరిట తాను చేసిన ప్రమాణానికి పరిహారంగానూ, తనను తాను సరిదిద్దుకుంటూ – అతడు “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలకాలి. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసినారు: జూదము అంటే అందులో ఇద్దరు వ్యక్తులు పోటీ పడతారు. వారి మధ్య ధారాళంగా డబ్బు మార్పిడి ఉంటుంది. గెలిచిన వాడు మొత్తం డబ్బును తీసుకు వెళతాడు. ఇందులో ఉన్న ఇద్దరూ లాభనష్టాల ఊబి నుండి విముక్తులై లేరు. ఒకరి లాభము మరొకరి నష్టమవుతుంది. కనుక ఎవరైతే తన సహచరునితో ‘రా! మనం జూదమాడుదాం’ అని ఆహ్వానిస్తాడో, అలా ఆహ్వానించినందుకు ప్రాయశ్చితంగా అతడు దానధర్మాలు చేయాలి.

فوائد الحديث

ప్రమాణము చేయుట, ఒట్టుపెట్టుకొనుట అనేది కేవలం అల్లాహ్ యొక్క పేర్లు మరియు ఆయన గుణవిశేషణాల పైననే జరగాలి.

అల్లాహ్ పేరునగాక మరింకెవరి పేరున అయినా ప్రమాణము చేయుట, ఒట్టుపెట్టుకొనుట అనేది నిషేధము (హరాం), అది అల్’లాత్, అల్’ఉజ్జా వంటి విగ్రహాల పేరున అయినా, అమానత్ పేరున అయినా, లేక ప్రవక్త పేరున అయినా, ఇంకెవరి పేరున అయినా సరే – అది హరాం.

ప్రమాణం చేయుట (ఒట్టుపెట్టుకొనుట) అనేది అత్యంత గౌరవనీయమైన మరియు మహిమపరచబడిన నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ పేరున మాత్రమే జరగాలి. కనుక ఒకవేళ ఎవరైనా అల్-లాత్ లేదా అలాంటి మరింకెవరి పేరున అయినా ప్రమాణం చేస్తే అతను అవిశ్వాసులను అనుకరించిన వాడు అవుతాడు. కనుక ఈ హదీథులో అతను మరలా ఏకేశ్వరోపాసన (తౌహీద్) పదమైన “లా ఇలాహ ఇల్లల్లాహ్” పలకాలని ఆదేశించబడినాడు.

అల్లాహ్ పేరునగాక మరింకెవరి పేరున అయినా ప్రమాణం చేసిన వ్యక్తిపై ప్రమాణమును భంగపరచటానికి చెల్లించవలసిన ‘కఫ్ఫారా’ (పాపపరిహారం) ఏమీ లేదు. అయితే అతడు ఆ విధంగా ప్రమాణం చేసినందుకు పశ్చాత్తాప పడాలి మరియు అల్లాహ్’ను క్షమాపణ వేడుకోవాలి. ఎందుకంటే అది పరిహారం కంటే కూడా పెద్దది, అది పశ్చాత్తాపంతో తప్ప పరిహరించబడదు.

జూదం దాని అన్ని రూపాలలో, అన్ని పద్ధతులు మరియు రకాలలో నిషేధించబడినది. ఇది మహోన్నతుడైన అల్లాహ్ నిషేధించిన మద్యము మరియు విగ్రహాలతో ముడిపెట్టబడినది.

ఇందులో ఒకవేళ ఏదైనా పాపపు పనికి పాల్బడితే, అతడు (పశ్చాత్తాపపడి) ఆ స్థితి నుండి బయటకు రావాలి. ఇది అతనిపై వాజిబ్ (తప్పనిసరి విధి) అని తెలియుచున్నది.

ఒకవేళ ఎవరైనా ఏదైనా చెడు పనికి పాల్బడితే, దాని నుండి బయటపడి వెంటనే ఒక మంచి పని చేయాలి. ఎందుకంటే మంచి పనులు చెడు పనులను తుడిచివేస్తాయి

التصنيفات

వారించబడిన పదాలు మరియు నాలుక ఆపదలు