“అల్లాహ్, (దాసుడు) తన ఆదేశాలను తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను ఏవిధంగానైతే ఇష్టపడతాడో, తాను అనుమతించిన విషయాలను…

“అల్లాహ్, (దాసుడు) తన ఆదేశాలను తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను ఏవిధంగానైతే ఇష్టపడతాడో, తాను అనుమతించిన విషయాలను (సౌలభ్యాలను, రాయితీలను) తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను కూడా అదే విధంగా ఇష్టపడతాడు”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “అల్లాహ్, (దాసుడు) తన ఆదేశాలను తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను ఏవిధంగానైతే ఇష్టపడతాడో, తాను అనుమతించిన విషయాలను (సౌలభ్యాలను, రాయితీలను) తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను కూడా అదే విధంగా ఇష్టపడతాడు”.

[దృఢమైనది] [దాన్ని ఇబ్నె హిబ్బాన్ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: షరియత్ ప్రకారము బాధ్యులైన వ్యక్తుల కొరకు (ముకల్లిఫ్’ల కొరకు), కొన్ని ప్రత్యేక పరిస్థితులలో, షరియత్ యొక్క ఆదేశాలను ఆచరించుటలో, ఆరాధనలలో (అహ్’కామ్, మరియు ఇబాదాత్ లలో) అల్లాహ్ కొన్ని రాయితీలను, సదుపాయాలను, సౌలభ్యాలను ప్రసాదించినాడు. ఉదాహరణకు ప్రయాణములో ఉంటే రెండు నమాజులను ఒకే సమయాన ఆచరించుట, మరియు నమాజులలో రకాతుల సంఖ్యను తక్కువ చేసి ఆచరించుట మొదలైనవి. తన దాసుడు ఆ రాయితీలు తీసుకొనుటను అల్లాహ్ ఇష్టపడతాడు. ఏ విధంగానైతే, విధి చేయబడిన విషయాలకు సంబంధించి తన ఆదేశాలను దాసుడు తీసుకొనుటను, వాటి పై ఆచరించుటను ఆయన ఇష్టపడతాడో. ఎందుకంటే విధి చేయబడిన విషయాలకు సంబంధించి అయినా, రాయితీలకు సంబంధించి అయినా అల్లాహ్ యొక్క ఆదేశము ఒక్కటే (ఆదేశిస్తున్నది అల్లాహ్ యే).

فوائد الحديث

ఈ హదీసులో, షరియత్ యొక్క ఆదేశాలలో (కొన్ని సందర్భాలలో‌) రాయితీలు ప్రసాదించుటలో, తన దాసులపై పరమ పవిత్రుడైన అల్లాహ్ యొక్క అనుగ్రహం, ఆయన కరుణ తెలుస్తున్నది. ఆ రాయితీలను దాసుడు స్వీకరించుటను అల్లాహ్ ఇష్టపడతాడు.

అలాగే ఈ హదీసులో, షరియత్ యొక్క పరిపూర్ణత మరియు ఆదేశాలను పాటించుటలో ఒక ముస్లిం ఎదుర్కొనే కష్టాలను తొలగించుట కనిపిస్తున్నది.

التصنيفات

ధర్మ ఆదేశం, ధర్మ ఉద్దేశాలు