“ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా ‘ఫలానా భూమిపై (ఫలానా ప్రదేశములో) చనిపోతాడు” అని విధివ్రాతలో లిఖించి ఉంటే, అతడు…

“ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా ‘ఫలానా భూమిపై (ఫలానా ప్రదేశములో) చనిపోతాడు” అని విధివ్రాతలో లిఖించి ఉంటే, అతడు అక్కడికి వెళ్ళడానికి ఏదైనా కారణాన్ని అతని కొరకు పొందుపరుస్తాడు”

మతర్ ఇబ్న్ ఉకామిస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా ‘ఫలానా భూమిపై (ఫలానా ప్రదేశములో) చనిపోతాడు” అని విధివ్రాతలో లిఖించి ఉంటే, అతడు అక్కడికి వెళ్ళడానికి ఏదైనా కారణాన్ని అతని కొరకు పొందుపరుస్తాడు”.

[దృఢమైనది] [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒకవేళ అల్లాహ్, తన దాసులలో ఎవరినైనా, భూమిపై ఫలానా ప్రదేశములో చనిపోతాడు, అని నిర్ణయించి ఉంటే, విధివ్రాతలో రాసి ఉంటే, ఆ దాసుడు అక్కడ నివసిస్తున్న వాడు కాకపోయినా, అతడు అక్కడి వెళ్ళే ఒక అవసరాన్ని (ఒక కారణాన్ని) ఏర్పరుస్తాడు. అప్పుడు అతని ఆత్మ అక్కడ (ఆ ప్రదేశములో) తీయబడుతుంది.

فوائد الحديث

ఈ హదీసు సర్వోన్నతుడూ, సర్వ శక్తి మంతుడూ అయిన అల్లాహ్ యొక్క వాక్కును - وَمَا تَدْرِى نَفْسٌۢ بِأَىِّ أَرْضٍۢ تَمُوتُ ۚ - (మరియు ఏ మానవుడూ తాను ఏ భూభాగంలో మరణిస్తాడో ఎరుగడు, సూరహ్ లుఖ్మాన్ 31:34) – ధృవపరుస్తున్నది.

التصنيفات

తీర్పు , విధి వ్రాత పై విశ్వాసం., మరణం దాని ఆదేశాలు