నిశ్చయంగా మీ అందరిలోకెల్లా అల్లాహ్ పట్ల అత్యంత భయభీతి కలవాడను మరియు ఆయన గురించి మీకంటే బాగా తెలిసినవాడను నేనే

నిశ్చయంగా మీ అందరిలోకెల్లా అల్లాహ్ పట్ల అత్యంత భయభీతి కలవాడను మరియు ఆయన గురించి మీకంటే బాగా తెలిసినవాడను నేనే

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పనులను ఆదేశించినప్పుడు, వారు చేయగలిగిన వాటినే ఆదేశించేవారు. వారు ఇలా అన్నారు: "ఓ ప్రవక్తా! మేము మీలాంటి వాళ్ళం కాదు. నిశ్చయంగా అల్లాహ్ మీ గత మరియు భవిష్యత్ పాపాలను క్షమించాడు". అప్పుడు ఆయన ఎంతగా కోపగించుకున్నారంటే, ఆయన ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత ఆయన ఇలా సెలవిచ్చారు: «నిశ్చయంగా మీ అందరిలోకెల్లా అల్లాహ్ పట్ల అత్యంత భయభీతి కలవాడను మరియు ఆయన గురించి మీకంటే బాగా తెలిసినవాడను నేనే».

[ప్రామాణికమైన హదీథు] [అల్ బుఖారీ నమోదు చేసినారు:]

الشرح

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ఏదైనా ఆచరణ (ఆరాధన) చేయమని ఆజ్ఞాపించినప్పుడు, వారు దానిని నిరంతరం కొనసాగించడంలో విఫలమవుతారేమోనన్న భయంతో, వారికి కష్టమైనది కాకుండా సులభమైన దానినే ఆజ్ఞాపించేవారు. ఆయన కూడా, వారికి ఆజ్ఞాపించిన సులభమైన పనులనే ఆచరించేవారు. అయితే వారు, ఆయన కంటే ఉన్నత స్థాయిలను పొందడానికి, తాము ఆరాధనలలో మరింత ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఉందని భావించి, కష్టమైన పనులను తమపై విధించమని ఆయనను కోరారు. అప్పుడు వారు ఇలా పలుకుతారు: "ఓ రసూలుల్లాహ్! నిశ్చయంగా మా పరిస్థితి మీ పరిస్థితిలాంటిది కాదు, ఎందుకంటే అల్లాహ్ మీ గత మరియు భవిష్యత్ పాపాలను మన్నించాడు." దానికి ఆయన ముఖంలో స్పష్టంగా ఆగ్రహం కనిపించేంతగా ఆయన ఆగ్రహం చెందారు. ఆ తరువాత ఆయన ఇలా పలికారు: "నిశ్చయంగా మీలోకెల్లా అత్యంత దైవభీతిపరుడను మరియు అల్లాహ్ గురించి అత్యధికంగా తెలిసినవాడను నేనే. కావున, నేను మీకు ఆజ్ఞాపించిన దానిని మీరు చేయండి.

فوائد الحديث

ఇబ్న్ హజర్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: వారు నిరంతరం ఆచరించాలని ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) వారికి సులభమైన దానినే ఆజ్ఞాపించారు, మరొక హదీథులో ఆయన చెప్పినట్లుగా: “అల్లాహ్‌కు అత్యంత ప్రియమైన కార్యం నిరంతరం చేసేది.”

సత్పురుషుడు తన మంచితనంపైనే ఆధారపడి, సత్కార్యాలు చేయడంలో కృషి చేయుటను విడిచిపెట్టరాదు.

ఆడంబరం మరియు అహంకారం నుండి సురక్షితంగా ఉన్నప్పుడు, అవసరం మేరకు ఒక వ్యక్తి తనలో ఉన్న శ్రేష్ఠత గురించి మాట్లాడటానికి అనుమతి ఉన్నది.

ఆరాధనలో మొదటిది ఉద్దేశ్యం మరియు నిరంతరత, దానిని విడిచిపెట్టడానికి దారితీసే అతిశయోక్తి కాదు.

ఇబ్నె హజర్ ఇలా అన్నారు: దాసుడు ఆరాధనలో మరియు దాని ఫలాలలో పరాకాష్టకు చేరుకున్నప్పుడు, అది అతనిని దానిపై పట్టుదలగా ఉండేలా మరింత ప్రోత్సహిస్తుంది; దీని ద్వారా అతను అనుగ్రహాన్ని కాపాడుకుంటాడు మరియు దానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం ద్వారా దానిని అధికం చేసుకుంటాడు.

షరీఅతు ఆదేశాన్ని ఉల్లంఘించినప్పుడు ఆగ్రహించడం మరియు అర్థాన్ని గ్రహించగల నిపుణుడు దానిని గ్రహించడంలో విఫలమైతే, అతనిని జాగరూకత వైపు పురికొల్పడానికి అతనిని ఖండించడం షరీఅతు బద్దంగా రుజువు చేయబడింది.

ఇందులో తన సమాజం పట్ల (తన ఉమ్మత్ పట్ల) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దయ, కరుణ, ధర్మం యొక్క సౌలభ్యం మరియు షరియతు యొక్క ఋజుత్వం, సహనం కనిపిస్తున్నాయి.

ఆరాధన పట్ల సహాబాలకు గల తీవ్రమైన ఆకాంక్ష మరియు మంచిని మరింతగా ఆచరించాలనే వారి తపన.

షరీఅతు రూపకర్త నిర్దేశించిన కఠిన ఆదేశం మరియు అనుమతి అనే హద్దులకు కట్టుబడి ఉండటం మరియు షరీఅతుకు అనుగుణమైన సులభమైనది, దానికి విరుద్ధమైన కష్టమైన దాని కంటే ఉత్తమమైనదని విశ్వసించడం.

التصنيفات

మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ధర్మ ఆదేశం, The Sunnah, సత్కర్మల ప్రాముఖ్యతలు