“నరకాగ్ని కారణంగా ఈ మడమలకు నాశనం (కాచుకుని) ఉన్నది; వెళ్ళి పూర్తిగా (ఏ లోపమూ లేకుండా) ఉదూ చేయండి.”

“నరకాగ్ని కారణంగా ఈ మడమలకు నాశనం (కాచుకుని) ఉన్నది; వెళ్ళి పూర్తిగా (ఏ లోపమూ లేకుండా) ఉదూ చేయండి.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు మక్కా నుండి మదీనాకు తిరిగి వచ్చాము. దారిలో నీరు ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నపుడు, అస్ర్ సమయాన కొంతమంది త్వరత్వరగా వెళ్ళి హడావిడిగా ఉదూ చేసుకున్నారు. మేము వారి దగ్గరికి వెళ్ళినాము, వారి మడమలు మాకు కనిపిస్తూనే ఉన్నాయి, వాటికి (ఉదూ) నీరు చేరని కారణంగా అవి పొడిగా ఉన్నాయి. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నరకాగ్ని కారణంగా ఈ మడమలకు నాశనం (కాచుకుని) ఉన్నది; వెళ్ళి పూర్తిగా (ఏ లోపమూ లేకుండా) ఉదూ చేయండి.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలతో మక్కా నుండి మదీనాకు ప్రయాణించినారు. దారిలో వారు నీళ్ళున్న ప్రదేశాన్ని కనుగొన్నారు. దానితో సహాబాలలో కొంతమంది గబగబా వెళ్ళి అస్ర్ నమాజు కొరకు ఉదూ చేసుకున్నారు. అయితే వారి పాదాల వెనుక భాగము (మడమలు) నీరు చేరని కారణంగా పొడిగా కనిపించింది. దానితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఉదూ చేసేటప్పుడు పాదాల వెనుక భాగాన్ని సరిగా కడుక్కోకుండా నిర్లక్ష్యం చేసిన వారికి అగ్నిలో శిక్ష మరియు వినాశనం ఉన్నాయి”. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం క్షుణ్ణంగా ఉదూ పూర్తి చేయమని వారిని ఆదేశించినారు.

فوائد الحديث

ఉదూ చేయునపుడు పాదాలను కడుగుకొనుట విధి. ఎందుకంటే (కొందరు భావిస్తున్నట్లుగా) ఉదూలో పాదాలను కడుగవలసిన అవసరం లేదు, తడి చేతులతో పాదాలను తాకితే సరిపోతుంది అనడమే నిజమైతే, పాదాలను సరిగా కడుగక నిర్లక్ష్యం చేసిన వానిని నరకాగ్ని శిక్షతో హెచ్చరించవలసిన అవసరం ఉండేది కాదు.

నీటితో కడగ వలసిన అన్ని భాగాలను కడగడం తప్పనిసరి, మరియు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా లేదా అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా శుద్ధి చేయవలసిన శరీర భాగాలలో దేనిలోనైనా కొంత భాగాన్ని వదిలివేస్తే, అతని నమాజు సరికాదు.

ఈ హదీసులో విషయ పరిఙ్ఞానం లేని వారికి బోధించడం మరియు వారికి మార్గదర్శకం చేయడం యొక్క ప్రాధాన్యత తెలియుచున్నది.

ధర్మపండితుడు (ఆలిమ్), ఎవరైనా వ్యక్తిని విధిగా చేయవలసిన ఆరాధనలను మరియు సున్నత్ ఆరాధనలను విస్మరించినట్లు చూస్తే, తగిన రీతిలో అతడిని సరిదిద్దాలి.

ముహమ్మద్ ఇస్’హాఖ్ అల్ దహ్లవీ ఇలా అన్నారు: ‘అల్ ఇస్బాఘ్’ (ఉదూ చేయుటలో విధుల పరిపూర్ణత సాధించుట) మూడు రకాలుగా ఉంటుంది: ఆ భాగాన్ని ఒక సారి కడుగుట విధి; మూడుసార్లు కడుగుట సున్నత్; అభిలషణీయం ఏమిటంటే – ఎక్కువలో ఎక్కువ మూడు పర్యాయాలకు లోబడి క్షుణ్ణంగా శుభ్రపరుచుకొనుట.

التصنيفات

వజూ పద్దతి