వజూ పద్దతి

వజూ పద్దతి

1- హుమ్రాన్ మౌలా (ఈయన ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు యొక్క బానిసలలో ఒకరు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ ఈయనకు స్వేచ్ఛ ప్రసాదించి, బానిసత్వము నుండి విముక్తి చేసినారు) ఉల్లేఖన: అతను ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు వుజూ చేయుట కొరకు నీళ్ళు తెప్పించగా చూసినారు. అపుడు ఆయన (ఉస్మాన్ రజియల్లాహు అన్హు) (ఆ నీటి పాత్ర నుండి) తన రెండు చేతులపై నీళ్ళను వొంపుకుని మూడు సార్లు బాగా కడిగినారు. తరువాత నీటిలో తన కుడి చేతిని వేసి, గుప్పెడు నీళ్ళతో తన నోటినీ మరియు ముక్కునూ శుభ్రపర్చుకున్నారు. తరువాత ఆయన తన ముఖాన్ని మూడు సార్లు కడుగుకున్నారు, తన చేతులను మోచేతుల వరకు మూడు సార్లు కడిగినారు. తరువాత (తడి అరచేతులతో) తన తలను తుడిచినారు. తరువాత తన పాదాలను (చీలమండలాల వరకు) మూడు సార్లు కడిగినారు. తరువాత ఆయన ఇలా అన్నారు: “ఇపుడు నేను ఏవిధంగా ఉదూ చేసినానో, అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేయగా నేను చూసినాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని తెలిపినారు “@ఎవరైతే నేను చేసిన విధంగా వుజూ చేసి, తరువాత నిలబడి, రెండు రకాతుల నమాజును ఖుషూతో అంటే ఆ రకాతులలో తన మనసు, తన ఆలోచనలు ఎటూ పోకుండా, నమాజుపైనే నిలిపి ఆచరిస్తాడో, అతడి పూర్వపు పాపాలు క్షమించి వేయబడతాయి.*”

2- “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు మక్కా నుండి మదీనాకు తిరిగి వచ్చాము. దారిలో నీరు ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నపుడు, అస్ర్ సమయాన కొంతమంది త్వరత్వరగా వెళ్ళి హడావిడిగా వుదూ చేసుకున్నారు. మేము వారి దగ్గరికి వెళ్ళినాము, వారి మడమలు మాకు కనిపిస్తూనే ఉన్నాయి, వాటికి (వుదూ) నీరు చేరని కారణంగా అవి పొడిగా ఉన్నాయి. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @“నరకాగ్ని కారణంగా ఈ మడమలకు నాశనం (కాచుకుని) ఉన్నది; వెళ్ళి పూర్తిగా (ఏ లోపమూ లేకుండా) వుదూ చేయండి.”

3- “అమ్ర్ ఇబ్న్ అబీ హసన్, అబ్దుల్లాహ్ ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హు ను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ విధానానం గురించి ప్రశ్నించడం నేను చూసాను. దానితో ఆయన ఒక చిన్న పాత్రలో నీళ్ళు తీసుకు రమ్మని ఒకరికి పురమాయించారు.@దానితో ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన విధంగా వుజూ చేసినారు*. (ముందుగా) ఆయన ఆ నీటి పాత్రను వొంపి చేతులపై నీళ్ళు పోసుకుని, రెండు చేతులను మూడు సార్లు కడిగినారు. తరువాత ఆ పాత్రలో చేయి పెట్టి చేతి నిండా నీళ్ళు తీసుకుని నోటిలో పుక్కిలించి, (ముక్కు లోనికి నీళ్ళు ఎక్కించి) ముక్కును చీది (నోటినీ, ముక్కునూ) మూడు సార్లు శుభ్రపరుచుకున్నారు. తరువాత ఆ పాత్రలో చేయి పెట్టి చేతి నిండా (మూడు సార్లు) నీళ్ళు తీసుకుని ముఖాన్ని మూడు సార్లు కడిగినారు; తరువాత నీటి పాత్రలో చేయి పెట్టి, నీటితో రెండు చేతులను మోచేతుల సమేతంగా రెండుసార్లు కడిగినారు; తరువాత నీటి పాత్రలో చేతులు పెట్టి (తడి చేతులతో) తలను ఒకసారి మసాహ్ చేసినారు (తడిమినారు) – చేతులను తల ముందు భాగము నుండి వెనుకకు తీసుకు వెళ్ళి, వెనుకనుండి ముందుకు తెచ్చినారు. తరువాత పాదాలను చీలమండలముల వరకు కడిగినారు.”