“మీలో ఎవరైనా ఒకవేళ నిద్ర నుంచి లేచినట్లయితే అతడు నీటితో ముక్కును మూడు సార్లు శుభ్రపరుచుకోవాలి, ఎందుకంటే…

“మీలో ఎవరైనా ఒకవేళ నిద్ర నుంచి లేచినట్లయితే అతడు నీటితో ముక్కును మూడు సార్లు శుభ్రపరుచుకోవాలి, ఎందుకంటే షైతాను అతని ముక్కుపుటాలపై రాత్రి గడుపుతాడు కనుక.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా ఒకవేళ నిద్ర నుంచి లేచినట్లయితే అతడు నీటితో ముక్కును మూడు సార్లు శుభ్రపరుచుకోవాలి, ఎందుకంటే షైతాను అతని ముక్కుపుటాలపై రాత్రి గడుపుతాడు కనుక.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హితబోధ చేస్తున్నారు: ఎవరైతే నిద్రలేస్తారో వారు ముక్కును నీటితో మూడుసార్లు శుభ్రపరుచుకోవాలి. ముక్కును నీటితో శుభ్రపరుచుకోవడం అంటే, ముక్కులోనికి నీరు ఎక్కించి తరువాత ఆ నీటిని చీది వేయడం. ఎందుకంటే షైతాను అతని ముక్కు పుటాల మీద రాత్రి గడుపుతాడు కనుక; అంటే పూర్తి ముక్కుపై.

فوائد الحديث

ఈ హదీథులో తన ముక్కు నుండి షైతాను యొక్క జాడలను తొలగించడానికి నిద్ర నుండి మేల్కొనే ప్రతి ఒక్కరూ ముక్కును నీటితో చీది శుభ్రం చేసుకోవాలని సూచించబడినది. ఒకవేళ అతడు నిద్ర నుంచి లేచినపుడు ఉదూ చేసుకోబోతున్నట్లయితే, అందులో ముక్కును నీటితో చీది శుభ్రపరుచుకోవడం ముఖ్యంగా ప్రస్తావించబడినది.

ముక్కును నీటితో చీది శుభ్రపరుచుకొనుటలో రెండు విషయాలున్నాయి, ‘అల్-ఇస్తిన్’షాఖ్’ (ముక్కులోనికి నీటిని ఎక్కించుట); మరియు ‘అల్ ఇస్తిన్’థార్’ (ముక్కులోనికి ఎక్కించిన నీటిని చీది బయటకు తీయుట). ‘అల్-ఇస్తిన్’షాఖ్’ ముక్కు లోపలి భాగాన్ని శుభ్రపరుస్తుంది; ‘అల్ ఇస్తిన్’థార్’ ముక్కులోని ధూళిని, మలినాలను నీటితో బయటకు తీసుకువస్తుంది.

ఈ విధంగా ముక్కును మూడు సార్లు నీటితో చీది శుభ్రపరుచు కోవడం అనేది రాత్రి నిద్రకు ప్రత్యేకించబడినది. హదీథులోని “...రాత్రి గడుపుతాడు” అనే పదాలు దీనిని సూచిస్తున్నాయి. “రాత్రి గడుపుట” అనేది కేవలం రాత్రి నిద్రలో మాత్రమే సాధ్యమవుతుంది, మరియు రాత్రిపూట నిద్ర మరింత గాఢంగా పట్టి, ఎక్కువసేపు నిద్రపోయే అవకాశం ఉన్నది.

షైతాను ఒక వ్యక్తిని అతనికి తెలియకుండానే తన ఆధీనంలోకి తీసుకోగలడు అనడానికి ఈ హదీథు సాక్ష్యం.

التصنيفات

వజూ పద్దతి