“ప్రకటన చేసేవాడు ఇలా ప్రకటిస్తాడు: “మీరు శాశ్వతంగా ఆరోగ్యవంతులై ఉంటారు; ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కారు; మీరు…

“ప్రకటన చేసేవాడు ఇలా ప్రకటిస్తాడు: “మీరు శాశ్వతంగా ఆరోగ్యవంతులై ఉంటారు; ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కారు; మీరు శాశ్వతంగా జీవితులై ఉంటారు, ఎన్నటికీ చనిపోరు; మీరు శాశ్వతంగా యవ్వనంలో ఉంటారు, ఎన్నటికీ వృద్ధులు కారు; మరియు మీరు ఎల్లప్పుడూ సిరిసంపదలతో, సంపన్న పరిస్థితుల్లో జీవిస్తారు మరియు ఎప్పటికీ నిరుపేదలుగా మారరు;

అబూ సఈద్ అల్ ఖుద్రీ మరియు అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ప్రకటన చేసేవాడు ఇలా ప్రకటిస్తాడు: “మీరు శాశ్వతంగా ఆరోగ్యవంతులై ఉంటారు; ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కారు; మీరు శాశ్వతంగా జీవితులై ఉంటారు, ఎన్నటికీ చనిపోరు; మీరు శాశ్వతంగా యవ్వనంలో ఉంటారు, ఎన్నటికీ వృద్ధులు కారు; మరియు మీరు ఎల్లప్పుడూ సిరిసంపదలతో, సంపన్న పరిస్థితుల్లో జీవిస్తారు మరియు ఎప్పటికీ నిరుపేదలుగా మారరు; ఇది సర్వోన్నతుడైన, సర్వశ్రేష్ఠుడైన అల్లాహ్ యొక్క వాక్కు: అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: ''మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే! సూరతుల్ ఆరాఫ్ 7:43.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావించారు: స్వర్గములోనికి చేరిన ప్రజలు సంతోషానందాలతో ఉండగా వారిని ఉద్దేశించి ప్రకటన చేసేవాడొకడు ఇలా ప్రకటిస్తాడు: స్వర్గంలో మీరు శాశ్వతంగా ఆరోగ్యవంతులై ఉంటారు, ఎన్నటికీ వ్యాధిగ్రస్తులు కారు, అది ఎంత చిన్న సుస్తీ లేక నలత అయినా సరే; అక్కడ మీరు శాశ్వత జీవితులై ఉంటారు, ఎన్నటికీ మరణించరు, అది స్వల్పకాల మరణంగా భావించబడే నిద్ర అయినా సరే; అక్కడ మీరు శాశ్వతంగా యవ్వనవంతులై ఉంటారు, ఎన్నటికీ వృధ్ధులు కారు; మరియు మీరు అక్కడ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో సంపన్నులుగా జీవిస్తారు, ఎప్పుడూ మీకు కష్టము, బాధ, పేదరికం కలుగవు. ఎందుకంటే ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తెలిపిన ప్రకటన: అపుడు వారికి ఒక వాణి వినబడుతుంది: ''మీరు చేస్తూ ఉండిన సత్కార్యాలకు ఫలితంగా మీరు వారసులుగా చేయబడిన స్వర్గం ఇదే!) సూరతుల్ ఆరాఫ్ 7:43.

فوائد الحديث

ఈ ఇహలోక జీవిత సుఖాలకు, దాని యజమాని ఎంత విలాసవంతంగా ఉన్నా, అతిపెద్ద అడ్డంకులు నాలుగు విషయాలు - అవి వ్యాధి, మరణం, వృద్ధాప్యం, శత్రువుల భయంతో బాధపడటం మరియు దుఃఖం, పేదరికం, యుద్ధం మరియు ఇతర విషయాలు. స్వర్గవాసులు వీటన్నిటి నుండి సురక్షితంగా ఉంటారు, కనుక స్వర్గవాసులు అత్యంత సంపూర్ణమైన ఆనందం కలిగి ఉంటారు.

స్వర్గం యొక్క ఆనందాలు మరియు ఈ ప్రపంచంలోని ఆనందాల మధ్య వ్యత్యాసం: స్వర్గం యొక్క ఆనందాలు భయం లేకుండా ఉంటాయి, అయితే ఈ ప్రపంచంలోని ఆనందాలు శాశ్వతంగా ఉండవు, బాధలు, కష్టాలు మరియు అనారోగ్యాల ద్వారా అవి ప్రభావితమవుతాయి.

ఇందులో స్వర్గం యొక్క ఆనందాలకు దారి తీసే ధర్మబద్ధమైన పనులు చేస్తూ ఉండాలనే ప్రోత్సాహం మరియు హితబోధ ఉన్నది.

التصنيفات

స్వర్గము,నరకము యొక్క లక్షణాలు