“ఆ నీరు ఒకవేళ “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి) సమానంగా ఉంటే అది మాలిన్యాన్ని గ్రహించదు.”

“ఆ నీరు ఒకవేళ “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి) సమానంగా ఉంటే అది మాలిన్యాన్ని గ్రహించదు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను పశువులు మరియు వేటాడే జంతువులు తరుచూ త్రాగుతూ ఉండే నీటిని గురించి (వాటిని ఉపయోగించ వచ్చునా) అని ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఆ నీరు ఒకవేళ “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి) సమానంగా ఉంటే అది మాలిన్యాన్ని గ్రహించదు.”

[దృఢమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను జంతువులు మరియు క్రూర జంతువులు తరుచూ త్రాగుతూ ఉండే నీటి వనరులలోని నీటి పరిశుద్ధత గురించి ప్రశ్నించడం జరిగింది. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒకవేళ ఆ నీరు “ఖుల్లతైన్”లకు (రెండు పెద్ద కుండల నిండుగా ఉన్న నీటికి), అంటే దాదాపు 210 లీటర్లకు సమానంగా ఉంటే అది పెద్ద మొత్తంలో ఉన్న నీరుగా భావించబడుతుంది; అది మాలిన్యాన్ని గ్రహించదు, అశుద్ధత కారణంగా ఆ నీటి మూడు లక్షణాలైన రంగు, రుచి, వాసనలలో ఏ ఒక్క లక్షణమైనా మారనంత వరకు.

فوائد الحديث

నీరు దాని రంగు, రుచి మరియు వాసన అనే మూడు లక్షణాలలో, అపరిశుద్ధత కారణంగా ఏదైనా ఒక లక్షణంలో మార్పు వచ్చినట్లయితే ఆ నీరు అపరిశుద్ధమైనదిగా భావించ బడుతుంది. ఈ హదీథు సాధారణంగా చాలా సందర్భాలకు వర్తిస్తుంది, ఏదో ఒక నిర్దుష్ఠమైన సందర్భానికి కాదు.

ఒకవేళ పరిశుద్ధ వస్తువులు, అపరిశుద్ద పదార్థాల కారణంగా నీరు మార్పునకు లోనైనట్లయితె, అది పూర్తిగానే అపరిశుద్ధమై పోతుంది; ఆ అపరిశుద్ద పదార్థము, లేక ఆ అపరిశుద్ధ వస్తువు కొద్ది మొత్తములో ఉన్నా లేక ఎక్కువ మొత్తములో ఉన్నా సరే. ఈ విషయంపై ఉలమాలందరి ఏకాభిప్రాయం ఉన్నది.

التصنيفات

నీళ్ల ఆదేశాలు