“మీలో ఎవరైనా నలుగురు కూర్చుని ఉన్న ఒక సమూహం వద్దకు వచ్చినపుడు అతడు ‘సలాం’ (శాంతి శుభాకాంక్షలు) చెప్పాలి. అలాగే…

“మీలో ఎవరైనా నలుగురు కూర్చుని ఉన్న ఒక సమూహం వద్దకు వచ్చినపుడు అతడు ‘సలాం’ (శాంతి శుభాకాంక్షలు) చెప్పాలి. అలాగే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోవడానికి లేచి నిలుచున్నపుడు (కూడా) అతడు ‘సలాం’ చెప్పాలి. మొదటిది చివరిదానికంటే ఎక్కువ అర్హమైనది కాదు

అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “మీలో ఎవరైనా నలుగురు కూర్చుని ఉన్న ఒక సమూహం వద్దకు వచ్చినపుడు అతడు ‘సలాం’ (శాంతి శుభాకాంక్షలు) చెప్పాలి. అలాగే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోవడానికి లేచి నిలుచున్నపుడు (కూడా) అతడు ‘సలాం’ చెప్పాలి. మొదటిది చివరిదానికంటే ఎక్కువ అర్హమైనది కాదు.

[ప్రామాణికమైనది] [దాన్ని నసాయీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పేర్కొన్నారు: ఎవరైనా నలుగురు కూర్చుని ఉన్న దగ్గరికి వెళితే అతడు ‘సలాం’ చెప్పాలి, అలాగే అతడు సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్ళడానికి లేచినపుడు కూడా అక్కడి వారికి ‘సలాం’ చేయాలి; వెళ్ళేటప్పుడు చేసే రెండవ ‘సలాం’ కంటే వచ్చినప్పుడు చేసిన మొదటి ‘సలాం’ మరింత అర్హమైనది కాదు.

فوائد الحديث

ఇందులో ‘సలం’ను వ్యాప్తి చెందించుటకు ప్రోత్సాహము ఉన్నది.

అలాగే ఇందులో నలుగురు కూర్చుని ఉన్న దగ్గరికి వెళ్ళినపుడూ, లేక అక్కడినుండి సెలవు తీసుకుని వెళ్ళునపుడు కూడా ‘సలాం’ చేయాలి అనే ప్రొత్సాహం, హితబోధ ఉన్నది.

అల్-సింది (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి "మరియు అతను వెళ్లిపోవాలనుకుంటే" అనే ప్రకటన, ‘ఆ సమావేశం నుండి’ అని అర్థం, "మొదటి ‘సలాం’ రెండవ దానికంటే అంత అర్హమైనది కాదు" అంటే రెండూ సమానంగా అర్హమైనవే మరియు రెండూ అనుసరించాల్సిన నిజమైన సున్నతులు అని అర్థం. కాబట్టి, మొదటిది ధృవీకరించబడినప్పుడు రెండవదాన్ని వదిలివేయడానికి ఎటువంటి కారణం లేదు.

التصنيفات

సలాంచేసే మరియు అనుమతి కోరే పద్దతులు