“నీవు నీ రెండు చేతులతో ఇలా చేస్తే సరిపోయేది” అని ఆయన తన రెండు చేతులను భూమిపై ఒకసారి చరిచినారు, తరువాత తన ఎడమ…

“నీవు నీ రెండు చేతులతో ఇలా చేస్తే సరిపోయేది” అని ఆయన తన రెండు చేతులను భూమిపై ఒకసారి చరిచినారు, తరువాత తన ఎడమ చేతితో కుడి చేతి వెనుక భాగాన్ని, అలాగే కుడి చేతితో ఎడమ చేతి వెనుక భాగాన్ని, తరువాత ముఖాన్ని మసాహ్ చేసినారు

అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో పని మీద నన్ను మరొక ప్రదేశానికి పంపినారు. అక్కడ నేను “జనాబత్” స్థితికి (గుసుల్ తప్పనిసరిగా ఆచరించవలసిన స్థితికి) లోనయ్యాను. అక్కడ నీళ్ళు దొరకలేదు. దానితో నేను మట్టిలో జంతువు పొర్లిన విధంగా పొర్లాను. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినపుడు నేను ఆయనకు జరిగిన విషయాన్ని చెప్పాను. అపుడు ఆయన ఇలా అన్నారు: “నీవు నీ రెండు చేతులతో ఇలా చేస్తే సరిపోయేది” అని ఆయన తన రెండు చేతులను భూమిపై ఒకసారి చరిచినారు, తరువాత తన ఎడమ చేతితో కుడి చేతి వెనుక భాగాన్ని, అలాగే కుడి చేతితో ఎడమ చేతి వెనుక భాగాన్ని, తరువాత ముఖాన్ని మసాహ్ చేసినారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు అన్హు ను తనకు సంబంధించిన కొన్ని పనుల నిమిత్తం ఒక ప్రయాణంపై పంపినారు. అక్కడ ఆయన సంభోగములో పాల్గొనుట కారణంగానో, లేక వాంఛా పూర్వకంగా వీర్యమును బయటకు వచ్చేలా చేయుట కారణంగానో – జనాబత్ స్థితికి లోనయ్యారు. అయితే అక్కడ ఆయనకు గుసుల్ చేయడానికి నీళ్ళు లభించలేదు. జనాబత్ స్థితిలో (పెద్ద హదస్ స్థితిలో), నీళ్ళు లభించనపుడు ‘తయమ్ముమ్’ చేయుటను గురించిన ఆదేశము ఆయనకు తెలియదు. ఆయనకు కేవలం చిన్న హదస్ స్థితికి (వుజూ తప్పనిసరిగా చేయవలసిన స్థితి) సంబంధించిన ఆదేశం మాత్రమే తెలుసు. కనుక ఆయన, తన ఙ్ఞాన పరిధిలో, తనకు బాగా తెలిసి ఉన్న విషయాల ఆధారంగా బాగా ఆలోచించి – హదస్ అల్ అస్ఘర్ స్థితిలో ఉన్నపుడు (నమాజు సమయానికి) ఉదూ చేయడానికి (నీళ్ళు లభించకపోతే), నేల పైభాగాన ఉన్న మట్టితో లేక ధూళితో కొన్ని శరీర భాగాలపై మసహ్ చేయబడుతుంది; అదే విధంగా ‘జనాబత్’ స్థితి నుండి పరిశుద్థత పొందుట కొరకు పూర్తి మట్టి లేక ధూళి శరీరం మొత్తం లేపనం అయ్యేలా చేయాలి – ఇలా ఆయన నీటికి బదులుగా మట్టి లేదా ధూళిని ఉపయోగించడాన్ని పోల్చి చూసి, ఆయన తన శరీరం మొత్తం పై మట్టి లేపనం అయ్యేలా నేలపై పొర్లి, తరువాత నమాజు ఆచరించినాడు. తరువాత ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి నపుడు, తాను ఆచరించిన విధానం సరియైనదేనా అని తెలుసుకోవడానికి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు జరిగిన విషయాన్ని వివరించాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – రెండు హదస్ స్థితుల నుండి, అంటే మలమూత్ర విసర్జన తరువాత, లేక అపాన వాయువు విడుదల అయినట్లయితే శరీరం లోనయ్యే ‘చిన్న హదస్’ స్థితి (హదసుల్ అస్ఘర్ స్థితి); అలాగే వీర్యము విడుదల అయిన కారణంగా శరీరం లోనయ్యే పెద్ద హదస్ స్థితి (హదసుల్ అక్బర్’ ); ఈ రెండు హదస్ స్థితుల నుండి మట్టిని వినియోగించి ఏవిధంగా పరిశుద్ధత పొందాలో – ఆయనకు వివరించారు. ముందుగా తన రెండు అర చేతులను నేల పైభాగాన ఉన్న మట్టి లేక ధూళిపై ఒకసారి చరిచినారు, తరువాత ఎడమ చేతితో కుడి అరచేయి అవతలి భాగాన్ని, కుడి చేతితో ఎడమ అరచేయి అవతలి భాగాన్ని, తరువాత ముఖాన్ని మసహ్ చేసినారు (తడిమినారు).

فوائد الحديث

‘తయమ్మం’ చేయుటకు ముందు నీటి కొరకు ప్రయత్నించాలి (అక్కడున్న వారిని అడగాలి).

జనాబత్ స్థితిలో ఉన్న వ్యక్తి, నీళ్ళు లభ్యం కాని స్థితిలో, తయమ్ముం ఆచరించి పరిశుద్ధత పొందుట షరియత్ లో ఉన్న విషయమే.

‘హదసుల్ అక్బర్’ కొరకు ఆచరించబడే తయమ్ముం, ‘హదసుల్ అస్గర్’ కొరకు ఆచరించబడే తయమ్ముం రెండూ ఒకటే (వాటి మధ్య తేడా లేదు).

التصنيفات

తయమ్ముమ్