. :

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: రమదాన్ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించవద్దు. అయితే, ఎవరైనా ఒక నియమిత ఉపవాసాన్ని (అలవాటుగా) పాటించుతున్నట్లయితే, అతను దాన్ని కొనసాగించవచ్చు (ఉదా: ప్రతి సోమవారం లేదా ప్రతి గురువారం ఉపవాసం).

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రమదాన్‌ నెలకు ఒక్క రోజు లేదా రెండు రోజుల ముందు ఉపవాసం పాటించడాన్ని నిషేధించారు (రమదాన్ మొదటి రోజు ఉపవాసం తప్పి పోకుండా ముందు జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో). ఎందుకంటే రమదాన్ నెల ఉపవాసాల ఆరంభం ఖుర్ఆన్ ఆజ్ఞ ప్రకారం నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంది, కాబట్టి అనవసరంగా ముందస్తు ఏర్పాట్లు చేయవలసిన అవసరం లేదు.

فوائد الحديث

అతిగా ప్రవర్తించడం (అంటే ధర్మంలో అవసరం లేని ఆచరణలు చేయడం) నిషిద్ధం. ఎలాంటి హెచ్చింపులు లేదా తగ్గింపులు లేకుండా, అల్లాహ్ విధించిన ఆజ్ఞ ప్రకారం మాత్రమే ఆరాధనలు పాటించడం తప్పనిసరి.

దీని వెనుక ఉన్న వివేకం, హేతువు ఏమిటంటే: తప్పనిసరి ఆరాధనల (ఫర్జ్) మరియు స్వచ్ఛంద ఆరాధనల (నఫిల్) మధ్య తేడా చూపించడం (అసలు విషయం అల్లాహే యే ఎరుగును). రమదాన్‌ నెలను ఉత్సాహంగా, శక్తిగా స్వాగతించడానికి, మరియు ఉపవాసం ఆ పవిత్రమైన, ప్రత్యేకమైన నెలకు ప్రత్యేక చిహ్నంగా మిగిలి ఉండేందుకు గాను.

التصنيفات

సందేహం ఉన్న రోజు ఉపవాసాలు