. : :

ఇబ్నె అజ్'హర్ యొక్క ఒకప్పటి బానిస అయిన అబూ ఉబైద్ ఇలా ఉల్లేఖించినారు: నేను ఈద్ రోజున ఉమర్ ఇబ్నుల్-ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు)తో ఉన్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు: "ఇవి రెండు రోజులు — ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు రోజులలో ఉపవాసం పాటించడం నిషేధించారు: ఒకటి ఉపవాసాన్ని ముగించే రోజు (ఈదుల్-ఫిత్ర్), మరొకటి మీ ఖుర్బానీ నుండి తినే రోజు (ఈదుల్-అద్హా)."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ అల్-ఫిత్ర్ (రమదాన్ పండుగ) మరియు ఈదుల్-అద్హా (బక్రీదు పండుగ) దినాలలో ఉపవాసం చేయడం నిషేధించారు. ఈదుల్-ఫిత్ర్ అనేది రమదాన్ నెల తర్వాత ఉపవాసాన్ని ముగించే రోజు; ఈదుల్-అద్హా అనేది ఖుర్బానీ చేసి, దాని నుండి తినే రోజు. ఈ రెండు రోజులలో ఉపవాసం పాటించడం ఇస్లాంలో అనుమతించబడలేదు, ఎందుకంటే ఇవి ఆనందం, పండుగ, మరియు విందుభోజనం కోసం ప్రత్యేకించబడిన పవిత్ర దినాలు.

فوائد الحديث

ఈదుల్-ఫిత్ర్, ఈదుల్-అద్హా, మరియు తష్రీక్ దినాలలో ఉపవాసం చేయడం నిషిద్ధం. ఈదుల్-ఫిత్ర్ మరియు ఈదుల్-అద్హా ఉపవాసం నిషేధించబడింది. [తష్రీక్ రోజులు అంటే ఈదుల్-అద్హా తర్వాత వచ్చే మూడు రోజులు (దుల్హిజ్జా 11, 12, 13)]. ఈ రోజుల్లో కూడా ఉపవాసం చేయడం నిషిద్ధమే. కానీ, ఖుర్బానీ చేయలేని హజ్జ్ యాత్రికులకు మాత్రమే ఈ తష్రీక్ రోజుల్లో ఉపవాసం అనుమతించబడింది

ఇబ్ను హజర్ ఈ రెండు రోజుల గురించి ఇలా వ్యాఖ్యానించారు:

ఈ రెండు రోజుల (ఈదుల్-ఫిత్ర్, ఈదుల్-అద్హా) గురించి వివరించడం వల్ల లభించే ప్రయోజనం ఏమిటంటే — ఈ రోజుల్లో ఉపవాసాన్ని విడిచి పెట్టడం తప్పనిసరి కావడానికి ఉన్న షరీఅహ్ కారణాన్ని స్పష్టంగా చూపించడమే. అంటే, ఉపవాసం పాటించకూడని రోజులను పండుగ రోజులుగా ప్రత్యేకంగా గుర్తించటం, రమదాన్ ఉపవాసాన్ని పూర్తిచేసిన తర్వాత ఉపవాసాన్ని విడిచిపెట్టడం ద్వారా దీన్ని చూపించడమే. ఇంకొక కారణం: ఈదుల్-అద్హా రోజున ఖుర్బానీ చేయడం ద్వారా అల్లాహ్‌కు సమీపం కావడమే లక్ష్యం. ఆ ఖుర్బానీని చేసిన తరువాత, దానిలోంచి తినడం కూడా ఈ రోజు యొక్క ప్రత్యేకత.

ఇమాం తన ఖుత్బాలో ప్రస్తుత కాలానికి సంబంధించిన షరీఅహ్ విషయాలు, ఆజ్ఞలు, మార్గదర్శకమును ప్రస్తావించడం సిఫార్సు చేయబడింది. అలాగే, ప్రస్తుత సందర్భాన్ని (ఈద్, లేదా ఇతర ప్రత్యేక సందర్భం) దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన విషయాలను వివరించడం ఉత్తమంగా పరిగణించబడింది.

ఖుర్బానీ మాంసాన్ని తినడం ఇస్లాంలో అనుమతించబడినది

التصنيفات

ఉపవాసిపై నిషేధితమైనది