“ప్రాచీన ప్రవచనాల నుండి ప్రజలు నేర్చుకున్న విషయాలలో ఒకటి: “(ఆ పనిలో) సిగ్గు, అవమానం ఏమీ లేకపోయినట్లైతే, మీకు…

“ప్రాచీన ప్రవచనాల నుండి ప్రజలు నేర్చుకున్న విషయాలలో ఒకటి: “(ఆ పనిలో) సిగ్గు, అవమానం ఏమీ లేకపోయినట్లైతే, మీకు నచ్చినది చేయండి.”

అబూ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “ప్రాచీన ప్రవచనాల నుండి ప్రజలు నేర్చుకున్న విషయాలలో ఒకటి: “(ఆ పనిలో) సిగ్గు, అవమానం ఏమీ లేకపోయినట్లైతే, మీకు నచ్చినది చేయండి.”

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: పూర్వపు ప్రవక్తల ఆదేశాలను ప్రజలు తమలో తాము వ్యాపింపజేసుకునేవారు; ఆ విధంగా అవి శతాబ్దాల తరబడి ఒక శతాబ్దం తరువాత మరొక శతాబ్దానికి తరువాతి తరాల వారికి వారసత్వంగా సంక్రమిస్తూ వచ్చేవి; చివరికి అవి ఈ ఉమ్మత్ యొక్క తొలితరం వారికి చేరాయి; వాటిలో ఒకటి: ముందుగా నీవు ఏమి చేయాలనుకుంటున్నావో చూడు; అది అవమానకరమైనది, సిగ్గుపడవలసినది కానట్లైతే, అపుడు ఆ పని చేయి; ఒకవేళ అది అవమానకరమైనది, సిగ్గుపడవలసిన పని అయినట్లైతే దానిని వదిలివేయి; ఎందుకంటే అవమానకరమైన పనుల నుండి మనలను నిరోధించేది సచ్ఛీలత, మరియు అణకువ. కనుక అణకువ మరియు సచ్ఛీలత లేని వారు ప్రతి అశ్లీల కార్యములో మరియు ప్రతి చెడులో, ప్రతి దుష్కర్మలో మునిగి పోతారు.

فوائد الحديث

సచ్ఛీలత, మరియు వినయం ఉన్నతమైన నైతికతకు పునాది.

సచ్ఛీలత, అణకువ మరియు వినయం అనేవి ప్రవక్తల (వారందరిపై అల్లాహ్ యొక్క శాంతి కురియుగాక) లక్షణం, వారి నుండి క్రింది తరాల వరకు ప్రసరిస్తూ వచ్చిన విషయాలలో అవి కూడా ఉన్నాయి.

సచ్ఛీలత, నిరాడంబరత అనేవి ముస్లింను అందమైన మరియు అలంకారప్రాయమైన ఆచరణలను చేయడానికి; అపవిత్రము మరియు అవమానకరమైన వాటిని వదిలిపెట్టడానికి ప్రోత్సహిస్తుంది.

ఇమాం అన్-నవవీ ఇలా అన్నారు: "ఇక్కడ ఆదేశం ఒక పనిని చేయడానికి లేదా దానిని వదిలివేయడానికి సంబంధించి అనుమతిని సూచిస్తుంది; అంటే, మీరు ఒక పని చేయాలనుకుంటే, అది అల్లాహ్ మరియు ప్రజల ముందు మిమ్మల్ని సిగ్గు పడేలా చేయకపోతే, దాన్ని చేయండి; లేకపోతే, అది చేయవద్దు. ఇది ఇస్లాం ధర్మం యొక్క మూలస్తంభం. అంటే ఆదేశించబడిన వాటిని, అనగా ‘ఫరాయిజ్’ (వాజిబాత్) మరియు ‘సున్నత్’లను, వదలివేయడం గురించి సిగ్గుపడాలి మరియు నిషేధించబడిన వాటిని, అనగా ‘హరాం’ మరియు ‘మక్రూహ్’ విషయాలను చేయడం గురించి సిగ్గుపడాలి. ఇక్కడ అనుమతి ఉన్న విషయం ఏమిటంటే: ఒక పనిని వదిలివేయడం సిగ్గుమాలిన పని అయితే ఎలాగైతే సిగ్గుపడతామో అదే విధంగా ఒక పనిని చేయడానికి సిగ్గుపడవలసి వస్తే, సిగ్గుపడడానికి అనుమతి ఉన్నది. ఈ విధంగా ఈ హదీథు ఐదు ఆదేశాలను కలిగి ఉన్నది. దీనిని గురించి కొందరు ఉలమా ఇలా అన్నారు: “ఇక్కడ ఆదేశము యొక్క అర్థము ఒక హెచ్చరిక”; అంటే సచ్ఛీలత నీనుండి దూరం అయిపోతే నీకు ఇష్ఠమైనది నీవు చేయి, అపుడు అల్లాహ్ దానికి తగినట్లు నిన్ను శిక్షిస్తాడు. మరికొందరు ఉలమా ఇలా అన్నారు: “ఇది ఒక ప్రకటనను పోలిన ఆదేశము; అంటే ఎవరిలోనైతే సచ్ఛీలత, అణకువ, వినయం ఉండవో అతడు తనకు ఇష్టం వచ్చిన దానిని చేస్తాడు.

التصنيفات

సద్గుణాలు