إذا جاء نصر الله والفتح :

إذا جاء نصر الله والفتح :

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై {إِذَا جَاءَ نَصْرُ اللَّهِ وَالْفَتْحُ} (అన్నస్ర్ సూరహ్ 1) అవతరించిన తర్వాత, ఆయన ప్రతి నమాజ్‌లో ఇలా పలకకుండా ఉండలేదు (నమాజు కొనసాగించలేదు): "సుబహానక రబ్బనా వ బిహమ్దిక, అల్లాహుమ్మఘ్ఫిర్లీ (మా ప్రభువా! నీవు పరమ పవిత్రుడవు, స్తుతులన్నీ నీకే శోభిస్తాయి, ఓ అల్లాహ్! నన్ను క్షమించు)."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా పలికినారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై "ఇదా జాఅ న్నస్రుల్లాహి వల్ ఫత్హు" (నస్ర్ సూరహ్) అవతరించినప్పుడు, ఆయన ఆ ఖుర్ఆన్ ఆయతులోని ఆదేశాన్ని అమలు చేయడంలో ఆత్రుత చూపారు. అల్లాహ్ ఆదేశించినట్లు: "కాబట్టి నీ ప్రభువును స్తుతితో మహిమపరచు, ఆయనను క్షమాపణ కోరు" (నస్ర్: 3). దీని ప్రకారం, ప్రవక్త ﷺ నమాజ్‌లోని రుకూలో, సజ్దాలో తరచుగా ఇలా పలికేవారు: "సుబహానక" అంటే: "ఓ అల్లాహ్! నీవు ప్రతి లోపం నుండి, కొరత నుండి పరమ పవిత్రుడవు, నీకు తగనిది ఏదీ నీలో లేదు."; "అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్దిక" అంటే: "ఓ అల్లాహ్! ఓ మా ప్రభువా, సకల స్తుతులు నీకే శోభిస్తాయి, నీ స్వరూపంలో, లక్షణాలు, కార్యాల్లో నీవు పరిపూర్ణుడవు."; "అల్లాహుమ్మగ్ఫిర్లీ" అంటే: "ఓ అల్లాహ్! నన్ను క్షమించు, నా పాపాలను తొలగించు, వాటిని మన్నించు."

فوائد الحديث

రుకూలో మరియు సజ్దాలో పై దుఆను ఎక్కువగా పఠించడం ముస్లింల కొరకు ప్రోత్సహించబడింది (ముస్తహబ్):

జీవితం చివరి దశలో క్షమాపణ (ఇస్తిగ్ఫార్) కోరడం ద్వారా ఒక ముఖ్యమైన విషయం మనకు తెలుస్తుంది: మన ఆరాధనలను ముఖ్యంగా నమాజ్‌ను కూడా చివర్లో క్షమాపణ వేడుకోవడంతో ముగించాలి. ఎందుకంటే, ఆ ఆరాధనలో మనం చేసిన లోపాలను, పొరపాట్లను అల్లాహ్ క్షమించాలి అని మనం వేడుకోవాలి.

అల్లాహ్ మన దుఆను స్వీకరించాలంటే, ఆయనను స్తుతించడం, ఆయన పవిత్రతను ప్రకటించడం, సకల లోపాలు - దోషాల నుండి ఆయనను పరమ పవిత్రుడిగా గుర్తించడం — ఇవే అత్యుత్తమ మార్గాలు. (అంటే, దుఆ ప్రారంభంలో అల్లాహ్ యొక్క మహిమ, గొప్పతనం, లోపరహితత్వంల దిక్ర్ చేయడం ద్వారా మన దుఆ అల్లాహ్ వద్ద మరింత ప్రియంగా, స్వీకారయోగ్యంగా మారుతుంది.)

ఇస్తిగ్ఫార్ (క్షమాపణ కోరడం) యొక్క గొప్పతనం మరియు దాన్ని ప్రతి సందర్భంలో కోరడం గురించి ఇక్కడ స్పష్టం చేయబడింది.

మహోన్నతుడైన అల్లాహ్ కు ప్రవక్త ﷺ యొక్క సంపూర్ణ దాస్యము మరియు అల్లాహ్ ఆదేశానికి ఆయన సంపూర్ణ విధేయత కూడా ఇక్కడ స్పష్టం అవుతున్నది.

التصنيفات

నమాజ్ దఆలు