“ఫాతిహతిల్ కితాబ్” (అంటే సూరహ్ అల్ ఫాతిహా) పఠించని వాని సలాహ్ (నమాజు) కాదు” (అనగా చెల్లదు, స్వీకారయోగ్యము కాదు)

“ఫాతిహతిల్ కితాబ్” (అంటే సూరహ్ అల్ ఫాతిహా) పఠించని వాని సలాహ్ (నమాజు) కాదు” (అనగా చెల్లదు, స్వీకారయోగ్యము కాదు)

ఉబాదహ్ ఇబ్న్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఫాతిహతిల్ కితాబ్” (అంటే సూరహ్ అల్ ఫాతిహా) పఠించని వాని సలాహ్ (నమాజు) కాదు” (అనగా చెల్లదు, స్వీకారయోగ్యము కాదు).

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్టం చేస్తున్నారు: సూరతుల్ ఫాతిహా పఠించబడని సలాహ్ (నమాజు) సరియైనది కాదు; ఎందుకంటే ప్రతి రకాతులో సూరతుల్ ఫాతిహా పఠించుట సలాహ్ యొక్క అర్కాన్’లలో ఒక రుక్న్ (మూలస్థంభాలలో ఒక మూలస్థంభము).

فوائد الحديث

సూరతుల్ ఫాతిహా పఠించగలిగి ఉండీ, దానిని పఠించకుండా ఇంకా ఏ సూరహ్ పఠించినా అది సరిపోదు, ఆమోదయోగ్యం కాదు.

ఏ రకాతులో నైనా, ఉద్దేశ్యపూర్వకంగా లేక అజ్ఞానం కొద్దీ, లేక మరిచిపోయి అయినా సూరతుల్ ఫాతిహా పఠించనట్లయితే ఆ రకాతు సంపూర్ణము కాదు (లోపభూయిష్టమైనది). ఎందుకంటే అది ఒక రుక్న్ (మూలస్థంభము); మూలస్థంభాలు ఎన్నడూ పాటించకుండా వదిలివేయబడవు.

అయితే ఇమాం రుకూ స్థితిలో ఉండగా సలాహ్’లో చేరిన వ్యక్తికి సూరతుల్ ఫాతిహ పఠించే నియమం వర్తించదు.

التصنيفات

నమాజు భాగాలు