“నిశ్చయంగా అల్లాహ్ నా సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి మనస్సులలోనికి వచ్చే (పరిపరి విధాల) ఆలోచనల కొరకు వారిని…

“నిశ్చయంగా అల్లాహ్ నా సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి మనస్సులలోనికి వచ్చే (పరిపరి విధాల) ఆలోచనల కొరకు వారిని క్షమించాడు – వారు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టనంత వరకు, లేక వాటిని బయటకు ఉచ్చరించనంత వరకు.”

అబూ హురరైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ నా సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి మనస్సులలోనికి వచ్చే (పరిపరి విధాల) ఆలోచనల కొరకు వారిని క్షమించాడు – వారు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టనంత వరకు, లేక వాటిని బయటకు ఉచ్చరించనంత వరకు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఒక ముస్లిం, ఒకవేళ తన మసులో చెడు ఆలోచనలు ఉన్నట్లైతే, అతడు వాటిపై అమలు చేయనంత వరకు లేదా వాటి గురించి బయటకు మాట్లాడనంత వరకు – అతడు అటువంటి చెడు ఆలోచనలు కలిగి ఉన్నందుకు బాధ్యుడుగా చేయబడడు, అల్లాహ్ అతని పై నుంచి ఆ భారాన్ని తొలిగించి అతణ్ణి క్షమించాడు. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి హృదయాలలో ఉన్న దానికి (అది చెడు ఆలోచన అయినా) అల్లాహ్ వారిని బాధ్యులను చేయలేదు; వారి హృదయాలలో ఉన్నది వారి ఆత్మలలో పునరావృతం అవుతూ ఉన్నా, అది అక్కడ స్థిరపడకుండా ఉన్నట్లైతే. ఒకవేళ అది అతని హృదయంలో స్థిరపడిపోయినట్లైతే, ఉదాహరణకు: గర్వము, అహంభావము, మోసము; కపటత్వము మొదలైనవి అక్కడ స్థిరపడిపోతే అప్పుడు అతడు బాధ్యునిగా నిలబెట్టబడతాడు; లేక అతడు తన అవయవాలతో ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టినా; లేక అతడు తన నాలుకతో వాటిని ఉచ్ఛరించినా – అపుడు అతడు బాధ్యునిగా నిలబెట్టబడతాడు.

فوائد الحديث

సకల శుభాల ప్రదాత, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ మనసులోనికి వచ్చే పరిపరి విధాల ఆలోచనలను, వ్యామోహాలను ఉపేక్షించినాడు, వదలివేసాడు, మరియు వాటిని క్షమించాడు. అవి వచ్చినపుడు మనిషి తనలో తానే మాట్లాడుకుంటాడు, లేక అవి అతని మనస్సులోనికి వచ్చి పోతూ ఉంటాయి.

ఉదాహరణకు విడాకులు, ఒకవేళ ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వాలనే ఆలోచన అతని మనస్సులోనికి వచ్చినట్లైతే, అతడు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నట్లైతే, లేక ఏ కాగితం మీదనైనా రాసి ఉండకపోతే, అతడు విడాకులు ఇచ్చినట్లు భావించబడదు.

ఒక వ్యక్తి, తన మనసులోనికి వచ్చి పోతూ ఉండే ఆలోచనలకు, వాటి గురించి తనలో తాను మాట్లాడుకొనుట పట్ల అతడు బాధ్యునిగా నిలబెట్టబడడు – అవి ఎంత గొప్ప ఆలోచనలైనా, లేక ఎంత ఘోరమైనవి అయినా – అవి అతని మనసులో స్థిరపడనంత వరకూ, వాటిపై అతడు అమలు చేయననంత వరకూ లేక వాటిని గురించి బయటకు మాట్లాడనంత వరకూ.

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ (సమాజం) యొక్క స్థితి, స్థాయి ఎంత గొప్పవి అంటే మన కంటే ముందు గడిచిన సమాజాలకు (ఉమ్మత్’లకు) భిన్నంగా మనసులోనికి వచ్చే పరిపరి విధాల ఆలోచనలకు, స్వీయసంభాషణకు జవాబుదారీగా నిలబెట్టకపోవడం. అది ఈ ఉమ్మత్ యొక్క ప్రత్యేకత.

التصنيفات

తలాఖ్ పదాలు