“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదారంగా ఉండేవారు. రమదాన్ నెలలో జిబ్రీల్ (అలైహిస్సలాం)…

“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదారంగా ఉండేవారు. రమదాన్ నెలలో జిబ్రీల్ (అలైహిస్సలాం) ఆయనను కలిసినపుడు ఆయన దాతృత్వం, ఉదారత మరింతగా పెరిగిపోయేవి

ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదారంగా ఉండేవారు. రమదాన్ నెలలో జిబ్రీల్ (అలైహిస్సలాం) ఆయనను కలిసినపుడు ఆయన దాతృత్వం, ఉదారత మరింతగా పెరిగిపోయేవి. జిబ్రీల్ (అలైహిస్సలాం) రమదాన్ మాసములో ప్రతి రాత్రి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కలిసి ఖుర్’ఆన్ పునశ్చరణ చేయుట కొరకు. అపుడు దాతృత్వములో, ఉదారతలో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వేగవంతమైన గాలి కంటే కూడా ఎక్కువ వేగంగా ఉండేవారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదార స్వభావి, రమదాన్ మాసంలో ఆయన దాతృత్వం మరింతగా పెరిగిపోయేది. తనను అర్థించిన వారికి ఏది అవసరమో దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చివేసేవారు. ఆయన దాతృత్వం అధికం కావడానికి రెండు విషయాలు కారణంగా ఉండేవి, అవి: మొదటిది: జిబ్రీల్ (అలైహిస్సలాం) తో ఆయన సమావేశం కావడం; రెండవ విషయం: కంఠస్థము చేసి, ధారణలో ఉంచుకున్న ఖుర్’ఆన్ ను పునశ్చరణ చేయడం. జిబ్రీల్ (అలైహిస్సలాం) ఖుర్ఆన్ యొక్క అవతరించిన ప్రతి ఆయతును ఆయన ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో అధ్యయనం చేసేవారు, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరింత ఉదారత్వముతో; అర్థించిన వారికి అర్థించిన దాని కంటే ఎక్కువ ప్రసాదిస్తూ, వీలైనంత ఎక్కువ మంచి చేస్తూ, అల్లాహ్ తన కరుణతో పంపే వర్షం మరియు మంచి గాలి కంటే వేగంగా ప్రజలకు మరింత త్వరగా ప్రయోజనం చేకూరుస్తూ ఉండేవారు.

فوائد الحديث

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క ఉదారతను గురించి, ముఖ్యంగా రమదాన్ మాసములో ఆయన ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాతృత్వం యొక్క విస్తారత గురించి ప్రస్తావించబడింది. ఎందుకంటే ఆ మాసము విధేయత మరియు సత్కార్యాల ఋతువులకు చెందిన మాసము.

ఇందులో ఎల్లప్పుడూ దాతృత్వాన్ని కొనసాగించాలని, రమదాన్ మాసంలో దానిని మరింతగా పెంచాలని సిఫార్సు చేయబడింది.

రమదాన్ మాసంలో దానధర్మాలు, ఖుర్ఆన్ పఠనం వంటివి ఎక్కువ చేయాలి.

జ్ఞాన పరిరక్షణ సాధనాలలో ఒకటి ఙ్ఞానవంతులైన విద్యార్థులతో మరియు పండితులతో దానిని అధ్యయనం చేయడం.

التصنيفات

రమదాన్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గౌరవం