“అల్ హసన్ మరియు అల్ హుసేన్ (రదియల్లాహు అన్హుమా) ఇద్దరూ స్వర్గములో యువకుల నాయకులు”

“అల్ హసన్ మరియు అల్ హుసేన్ (రదియల్లాహు అన్హుమా) ఇద్దరూ స్వర్గములో యువకుల నాయకులు”

అబూ సయీద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్ హసన్ మరియు అల్ హుసేన్ (రదియల్లాహు అన్హుమా) ఇద్దరూ స్వర్గములో యువకుల నాయకులు”.

[దృఢమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీథులో అలీ బిన్ అబీ తాలిబ్ మరియు తన కుమార్తె ఫాతిమా (రదియల్లాహు అన్హుమ్)ల సంతానమైన అల్ హసన్ మరియు అల్ హుసేన్ (రదియల్లాహు అన్హుమా)లు, ఎవరైతే ఈ ప్రపంచములో యవ్వనంలో చనిపోయి అల్లాహ్ అనుగ్రహముతో స్వర్గములో ప్రవేశిస్తారో వారందరికీ నాయకులుగా ఉంటారు అని అన్నారు. లేక దీని అర్థము వారిద్దరూ స్వర్గములో యువకులందరికీ నాయకులుగా ఉంటారు అని కూడా కావచ్చు; అయితే ప్రవక్తలు, సందేశహరులు మరియు ఖులఫా అర్’రాషిదీన్ లకు తప్ప.

فوائد الحديث

ఈ హదీథు అల్ హసన్ మరియు అల్ హుసేన్ (రదియల్లాహు అన్హుమా)ల యొక్క ఘనతను స్పష్టంగా తెలియజేస్తున్నది.

ఈ హదీథును గురించి ఇలా వాఖ్యానించబడినది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీథును ఉల్లేఖించిన సమయములో వారు (అల్-హసన్ మరియు అల్-హుసేన్) ఆ కాలములో ఉన్న యువతలో ఎవరైతే స్వర్గప్రవేశానికి అర్హులో, వారికి నాయకులుగా ఉంటారు; లేక ప్రవక్తలూ, మరియు సందేశహరులకు ప్రసాదించబడిన ఘనత మరియు సాధారణ ప్రాధాన్యాలు ప్రసాదించబడని వారి కంటే వీరిద్దరూ ఉన్నతులై ఉంటారు; లేదా వారు ఆ కాలమునాటి యవ్వనము, పౌరుషము వంటి లక్షణాలు కలిగి ఉన్న వారికి నాయకులుగా ఉంటారు, అంటే శౌర్యం, దాతృత్వం మరియు ధైర్యం మొదలైన లక్షణాలు. అయితే ఈ హదీథులో ప్రస్తావించినట్లుగా ఈ కాలము యవ్వన కాలాన్ని సూచించదు – ఎందుకంటే అల్-హసన్ మరియు అల్-హుస్సేన్ ఇద్దరూ మధ్య వయస్కులైన పురుషులుగా మరణించారు.

التصنيفات

ఆలె బైత్ యొక్క ఘనత