ఓ అబ్బాస్, ఓ రసూలల్లాహ్ యొక్క బాబాయ్, ఈ ప్రపంచములోనూ మరియు పరలోకములోనూ “ఆఫియహ్” ప్రసాదించమని అర్థించు”…

ఓ అబ్బాస్, ఓ రసూలల్లాహ్ యొక్క బాబాయ్, ఈ ప్రపంచములోనూ మరియు పరలోకములోనూ “ఆఫియహ్” ప్రసాదించమని అర్థించు” అన్నారు.”

అబ్బాస్ ఇబ్న్ అబ్దుల్ ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్! నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను అర్థించడానికి నాకు ఏదైనా బోధించండి”. దానికి ఆయన “ ‘అల్-ఆఫియహ్’(క్షేమము, శ్రేయస్సు, సుస్థితి, ఆరోగ్యము మొ.) ప్రసాదించమని అర్థించు” అన్నారు. కొన్ని రోజుల తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళి “ఓ రసూలల్లాహ్! నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను అర్థించడానికి నాకు ఏదైనా బోధించండి” అని అడిగాను. దానికి ఆయన: “ఓ అబ్బాస్, ఓ రసూలల్లాహ్ యొక్క బాబాయ్, ఈ ప్రపంచములోనూ మరియు పరలోకములోనూ “ఆఫియహ్” ప్రసాదించమని అర్థించు” అన్నారు.”

[ప్రామాణికమైన హదీథు] [అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:]

الشرح

ప్రవక్త యొక్క బాబాయి, అల్-అబ్బాస్ ఇబ్న్ అబ్దుల్-ముత్తలిబ్ (రదియల్లాహు అన్హు), ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అల్లాహ్ ను వేడుకోవడానికి ఒక దుఆను (ప్రార్థనను) నేర్పించమని అడిగారు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మం లోనూ, ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ విపత్తులు మరియు లోపాల నుండి భద్రత ప్రసాదించమని, మరియు శ్రేయస్సు, క్షేమము, సుస్థితి, ఆరోగ్యము మరియు భద్రత ప్రసాదించమని అల్లాహ్’ను వేడుకొనమని ఆయనకు బోధించారు. అల్-అబ్బాస్ ఇలా అన్నారు: "కొన్ని రోజుల తరువాత, నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తిరిగి వచ్చాను, అల్లాహ్’ను వేడుకోవడానికి నాకు ఒక దుఆ (ప్రార్థనను) నేర్పించమని అడిగాను”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు స్నేహపూర్వకంగా ఇలా చెప్పారు: “ఓ అబ్బాస్!, ఓ రసూలల్లాహ్ యొక్క బాబాయ్, మీరు శ్రేయస్సు కొరకు అల్లాహ్’ను అడగండి, అన్ని రకాల కీడులను, హానిని నివారించమని, ఇహలోకంలోనూ పరలోకం లోనూ మంచినీ, ప్రయోజనాన్ని కలిగించమని ప్రార్థించండి”.

فوائد الحديث

అల్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను, రెండవసారి అడిగినప్పుడు - దాసుడు తన ప్రభువును అడిగే ఉత్తమమైన విషయం క్షేమం మరియు శ్రేయస్సు అని సూచిస్తూ - అదే సమాధానాన్ని పునరావృతం చేశారు.

ఈ హదీథులో “ఆఫియహ్” ను కలిగి ఉండడం యొక్క ఘనత తెలుస్తున్నది; అందులో ఈ ప్రపంచములోని మంచి అంతా మరియు పరలోకంలోని మంచి అంతా ఉన్నది.

సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) తమ జ్ఞానాన్ని మరియు మంచితనాన్ని పెంచుకోవడం పట్ల ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉండేవారు.

التصنيفات

మాసూర్ దుఆలు